“ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం తప్పుపట్టింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో పాటు ,తగిన కార్యాచరణ లోపించడమే రోడ్డెక్కుతున్న వారికి శాపమవుతోంది. 2024 లో యాక్సిడెంట్లలో చనిపోయిన నిర్భాగ్యుల్లో 65శాతం 18-45 ఏళ్ల లోపువారే. యువశక్తిని అలా నష్టపోతుండటం, క్షతగాత్రుల చికిత్స వ్యయభారాలతో జీడీపీలో ఏటా మూడు శాతం మేర కోల్పోవాల్సి వస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతలు, బ్రీత్ ఎనలైజర్ పరికరాలు,డివైడర్లు, ఫ్లైఓవర్లు వంటివి నేడు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి.అయినా, ప్రమాదాలు ఎందుకు తగ్గట్లేదు? మన నగరాలెన్నింటితోనో పోలిస్తే- టోక్యో, వంటిచోట్ల జనసాంద్రత ఎక్కువ. అయినప్పటికీ విస్తృత ప్రజా రవాణా, అత్యుత్తమ మౌలిక వసతుల కల్పన, నిక్కచ్చిగా నిబంధనల అమలు ద్వారా ప్రయాణాలను అక్కడ సురక్షితం చేస్తున్నారు.అలాంటి మేలిమి విధానాలు కొరవడటంతోనే నగర భారతంలో రహదారులు నిత్యం నరమేధానికి వేదికలవుతున్నాయి.”
డాక్టర్ సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, సెల్ – 9866255355
భారతీయ రహదారులపై మృత్యుదేవత విలయతాండవం కొనసాగుతూనే ఉంది.కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదలచేసిన తాజా నివేదిక ఆ దురదృష్టకర వాస్తవాన్ని మరోసారి తేటతెల్లం చేసింది.దాని ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా సంభవించిన 4.73 లక్షల రహదారి ప్రమాదాలు 1.70 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. లక్షల మందిని గాయాలపాటేశాయి. 2023లో పోలిస్తే యాక్సిడెంట్లు 2.2 శాతం, మరణాలు 1.5 శాతం చొప్పున తగ్గినాయి. రోజుకు ఎందరో అభాగ్యులను కబళిస్తున్న ఘోర ప్రమాదాలు అయిదేళ్లలో పదిశాతం మేర అధికం కావడం- గాలిలో దీపమవుతున్న రహదారి భద్రతకు అద్దంపడుతోంది.మొత్తం రోడ్లలో పోల్చుకుంటే జాతీయ, రాష్ట్ర హైవేల వాటా అయిదు శాతం కన్నా తక్కువే. కానీ, సగానికి పైగా దుర్ఘటనలు, దాదాపు 60 శాతం మరణాల పాపం వాటిదే జాతీయ రహదారులపై మృత్యుఘోష పరంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా ఏపీ, తెలంగాణ వరసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి.
మృతుల్లో 45 శాతం ద్విచక్ర వాహనదారులైతే, 20శాతం పాదచారులు. వారిలో అత్యధికులు దిగువ, మధ్యాదాయ వర్గాల వారే. సంపాదించే వయసులోని వ్యక్తులను బలి తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు- ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం గడిచిన పందొమ్మిదేళ్లలో దేశీయంగా 28.2 లక్షల ప్రాణాలను రహదారులు కబళించాయి. ప్రపంచవ్యాప్త వాహనాల్లో ఇండియాలో ఉన్నవి ఒకశాతమే. కానీ, రహాదారి ప్రమాదాల్లో ఏటా 10శాతం మరణాలు మన దేశంలోనే సంభవిస్తున్నాయి.దీనికి కారణమేంటి? అతివేగం, రవాణా శాఖ నిబంధనలను గాలికొదిలేయడం,రోడ్ల నిర్మాణ ప్రణాళికల దశలోనే లొసుగులు, కక్కుర్తి పడే డ్రైవర్లకు రహదారులను అనుకోని వైన్ ,బార్ షాపులు, గతుకుల రోడ్లతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కడతేరిపోతున్నాయి.
ఈ సంవత్సరం ఎన్నో ప్రమాదాలు జరిగిన కర్నూల్ బస్సు ప్రమాద ఘటన దీపకాంతులతో వెలుగులు నింపే దీపావళి 19 కుటుంబాల్లో చీకటి నింపింది.బస్సు ప్రమాదంలో కాలి బూడిద అయ్యారు, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు వెళుతున్న యువకుడు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు, అందులో తెలంగాణకు చెందిన చనిపోయిన ఆరుగురిది ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాధ. భయంకర సంఘటన మరిచిపోకముందే చేవెళ్ల రోడ్ టెర్రర్ తెలంగాణ ప్రజలను కంటతడి పెట్టించింది.పెళ్లీడుకు వచ్చిన అక్క,చెల్లెళ్లను పొట్టన పెట్టుకుంది. వారిని కన్న తల్లిదండ్రుల ఆర్తనాదాలు అందరిని కలచివేసింది. ప్రయాణం అంటేనే భయం చెందే పరిస్థితి వచ్చింది, బీజాపూర్ హైవే ఎక్కడం అంటే స్మశాన వాటికకు పోతున్నట్టుగా ఊహించుకునే పరిస్థితి.నాలుగు రోజుల కింద జరిగిన బస్సు,టిప్పర్ ఢీకొన్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ రోడ్డు ఇరుకుగా ఉండడం, అందులో కిలోమీటరుకు ఒక మలుపు, దశాబ్దకాలంగా గతుకురోడ్లతో ప్రయాణికులు గజగజ వణికే పరిస్థితి, గంటకు రెండు వేల వాహనాలు వెళుతున్నాయని గణాంకాలు చెపుతున్నాయి.
ఎన్ హెచ్ 163 అప్ గ్రేడ్ కోసం 2022లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు,కానీ అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రహదారి న్యాయపరమైన చిక్కులు రావడంతో విస్తరణకు నోచుకోలేదు.రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పర్యావరణ వేత్తలతో పలుమార్లు చర్చలు జరపడం వల్ల స్టే వెకేట్ అయ్యింది. ప్రమాదాలకు రోడ్లు ఒక్కటే కారణం కాదు,ప్యాసింజర్ రోడ్ లో ఇసుక,కంకర ట్రాన్స్ పోర్ట్ వాహనాలు నడవడం వల్లనే ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలపై ఆందోళన చెందుతున్నారు.అయితే సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంతో తెలంగాణ లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.హజ్ -ఉమ్రా యాత్రకు తరలివెళ్లిన 45 మంది హైదరాబాద్ నుండి వెళ్లినవారే, పవిత్రంగా భావించే మక్కా భూమిలో భద్రత కరువైనందుకు యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబాల ఆర్తనాదాలు వింటే గుండె తరుక్కుపోతుంది.
ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం తప్పుపట్టింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో పాటు ,తగిన కార్యాచరణ లోపించడమే రోడ్డెక్కుతున్న వారికి శాపమవుతోంది. 2024 లో యాక్సిడెంట్లలో చనిపోయిన నిర్భాగ్యుల్లో 65శాతం 18-45 ఏళ్ల లోపువారే. యువశక్తిని అలా నష్టపోతుండటం, క్షతగాత్రుల చికిత్స వ్యయభారాలతో జీడీపీలో ఏటా మూడు శాతం మేర కోల్పోవాల్సి వస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతలు, బ్రీత్ ఎనలైజర్ పరికరాలు,డివైడర్లు, ఫ్లైఓవర్లు వంటివి నేడు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి.అయినా, ప్రమాదాలు ఎందుకు తగ్గట్లేదు? మన నగరాలెన్నింటితోనో పోలిస్తే- టోక్యో, వంటిచోట్ల జనసాంద్రత ఎక్కువ.
అయినప్పటికీ విస్తృత ప్రజా రవాణా, అత్యుత్తమ మౌలిక వసతుల కల్పన, నిక్కచ్చిగా నిబంధనల అమలు ద్వారా ప్రయాణాలను అక్కడ సురక్షితం చేస్తున్నారు.అలాంటి మేలిమి విధానాలు కొరవడటంతోనే నగర భారతంలో రహదారులు నిత్యం నరమేధానికి వేదికలవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో లోపాలు, సరైన శిక్షణ లేమి, ఇరుకిరుకు రోడ్లు, హైవేల పక్కనే మద్యం విక్రయాల వంటివీ ముప్పు తీవ్రతను పెంచుతున్నాయి. ఇలాంటి దురవస్థలో స్కూళ్లూ కాలేజీలకు, ఆఫీసులకు, ఊళ్లకు వెళ్లినవారు క్షేమంగా ఇల్లు చేరేదాకా కుటుంబసభ్యుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇలాంటి అభద్ర వాతావరణం దేశ ప్రగతికి చేటుచేస్తుందని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణంలో నాణ్యతతో పాటు, ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తే తలెత్తే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలి.వాటిని పెడచెవిన పెట్టిన ప్రజానీకంపై ల్సిన అవసరం ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించిన లోడ్ తో రోడ్ ఎక్కుతున్న వాహనాలపై మొద్దు నిద్ర పోయిన ఆర్ టి ఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు వరసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో బెంగళూరులో , హైదరాబాద్ , అమరావతిలో రవాణాశాఖ అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులను తనిఖీ ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించని అనేక బస్సులను ఇప్పటికే సీజ్ చేశారు. విచిత్రం ఏమిటంటే తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న బస్సులను అస్సలు వదలడం లేదు. దీనివల్ల ఆలిండియా టూరిస్ట్ బస్సులను పరిశీలించడంతో వ్యాపారుల లాలూచి బయటపడింది.అసలు విషయం ఇక్కడ ప్రభుత్వంకు ట్యాక్సీ కట్టకుండా నష్టం చేస్తూ, పలు బస్సులకు అనుమతి గడువు ముగిసినా రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్ పై తిరుగుతున్నట్లు ఆన్ లైన్ డేటా సమాచారం చెబుతుంది.
బస్సులో పరిమితికి మించి ప్రయాణం చేయడం కూడా ప్రమాదాలకు కారణమైంది.ఓవర్ లోడ్ కారణంగా టైర్ పేలడం, నిలబడి ప్రయాణం చేయడం గుంతల్లో బ్రేక్ వేసినప్పుడు డ్రైవర్ దృష్టి మళ్లడం, డ్రైవర్ కమ్ కండక్టర్ ఒక్కరే కావడం కూడా కారణం అయ్యింది.హైదరాబాద్ చిట్యాల రహదారిలో ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్క్యూట్ అయినా కారణంగా మంటల్లో కాలి బూడిదయ్యింది. ఇంతెందుకు సౌదీ లో జరిగిన బస్సు ప్రమాదంలో కూడా హైదరాబాద్ వాసాలు అసువులు బాసారు. దేశ, విదేశాల్లో నిత్యం ఎక్కడో ఒక దగ్గర ద్విచక్ర,త్రిచక్ర,నాలుగు చక్రాల బండి ప్రమాదానికి గురి అవుతూనే ఉన్నాయి, దీనికి కారణం ఫిట్ నెస్ లేని వాహనాలు ఒక వైపు, డ్రైవర్ల నిర్లక్ష్యం ఒకవైపు ప్రధాన కారణంగా గుర్తించి ఆర్టీఏ అధికారులు లైసెన్స్ రెన్యూవల్ లో ఫిట్ నెస్ గా ఉన్నాడా లేడా? అనేది చూస్తే కొంతమేరకు ప్రమాదాలను నివారించవచ్చు.