సౌదీలో ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఉమ్రా యాత్రికులు మృతిచెందడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. యాత్రికుల మృతి ప‌ట్ల‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *