ఈ నెల పంటల సేకరణకు కీలకం

– జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దిశానిర్దేశం
– ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: పంటల సేకరణకు ఈ నవంబర్‌ నెల కీలకమని, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్‌, తుమ్మల, సీఎస్‌ రామకృష్ణారావులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు .మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మలకు తెలిపారు. పత్తి కొనుగోలులో ఎల్‌-1, ఎల్‌-2 నిబంధనలు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను ఎత్తివేసి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని తెలిపారు. వర్షాల వల్ల రంగు మారిన సోయాచిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు జిల్లా కలెక్టర్లకు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *