సీఎంకు యాదగిరిగుట్ట అర్చకుల ఆశీర్వచనం

– పుట్టిన రోజు సందర్భంగా మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి యాదగిరిగుట్ట శ్ర్షీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్‌రెడ్డిని మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం ప్రత్యేకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా సీఎంను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రైజింగ్‌ తెలంగాణ 2047 లక్ష్యాన్ని వారి నేతృత్వంలో మనమందరం సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లక్ష్య సాధనలో దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని పొంగులేటి ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *