ఎప్పుడు ఎక్కడ మరణించావో అంతుపట్టదు
వాక్యాల్లో తేలిందేమని వెతుకుతావు
మబ్బులోనో నీళ్ళలోనో నేలపైనో
ఒక్కసారి ఎగిసి పడే కెరటాలు
నానిపోయిన దేహాల్లో బరువైన ఆత్మలు
ఇప్పుడిక్కడ మధువుని కొత్తగా అడిగేదెవరు
ఒక్కొక్కరిది ఒక్కొక్క సమయం
వలయాల్ని ఛేదించలేక కుహరాల్లో కూరుకుపోతూ
అర్ధిస్తావు కొంచం నెత్తురు అప్పుగా ఇవ్వమని
తపిస్తూ చేరేదెవ్వరిననే ప్రశ్న తిరగబడుతుంది
అసలిప్పుడు పుట్టడం జరిగిందా అన్నదే సందిగ్ధత
-శ్రీసుధ మోదుగు





