పంట కోతలను వాయిదా వేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు మంత్రి తుమ్మల సూచన
– లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి
– ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అఅక్టోబర్‌ 29 : మొంథా తుఫాను తీరం దాటి తుఫాను దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు పడుతున్నందున కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులు తమ పంటలను వర్షాల బారినుండి కాపాడుకోవాలని, తొందరపడి పంటలను అమ్ముకోవొద్దని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలు వాగులు, వంకలు దాటకుండా చూడాలని, అందుకోసం పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్ష ప్రభావంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా చెరువుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *