ఆడ‌బిడ్డ పుట్టిందని అమ్మ‌జూపిన క‌న్న‌వారు

– ప‌ట్టుకున్న ఐసీడీఎస్ సిబ్బంది
– తెలంగాణ స్టేట్ హోంకు త‌ర‌లింపు
– తక్షణ చర్యలకు ఆదేశించిన  టీజీ ఎస్సీ పీసీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: నాలుగోసారీ ఆడబిడ్డ పుట్టిందని కేవలం పది రోజులు పసిగుడ్డును క‌న్న‌వారు అమ్మేసిన దారుణ సంఘ‌ట‌న నల్గొండ జిల్లా కేంద్రంగా చోటుచేసుకుంది. నల్గొండ బిటిఎస్ కి చెందిన కుర్ర బాబుకి నాలుగో సంతానంలో కూడా అమ్మాయి పుట్టడంతో కుటుంబానికి అమ్మాయి భారంగా ఉందనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన వ్యక్తులకి అమ్మ చూపాడు. నల్గొండ జిల్లా ఐసిడిఎస్ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్, సిడబ్ల్యుసి అధికారులు అతని పట్టుకొని విచారణ చేపట్టారు. ప‌సికందును ప‌రిర‌క్ష‌ణ కోసం తెలంగాణ స్టేట్ హోంకు త‌ర‌లించారు. పాప తండ్రి తను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మూలంగా ఈ పని చేసినట్లు తెలిసింది. చట్ట విరుద్ధంగా పసికందు దత్తతను ప్రోత్సహించిన వారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. మరోవైపు  నల్గొండ జిల్లా కేంద్రంలో పదే పదే ఈ విదంగా జరుగుతున్న అధికారులు నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు, ఈ కారణంగా అధికారుల నిర్వహణ పై కమిషన్  అసంతృప్తి వ్యక్తం చేసింది.

కన్నబిడ్డ విక్రయంపై మంత్రి సీతక్క సీరియస్‌

నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ విక్రయ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీరియస్‌ అయ్యారు. ఈ సంఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ శృతి ఓజాతో మాట్లాడి వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పిల్లల అమ్మకాలపై, అక్రమ దత్తతపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా ఇలాంటి సం ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. శిశువును సంరక్షణలోకి తీసుకున్న తల్లి పరిస్థితిని తెలుసుకోవాలని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లీబిడ్డల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. పేదరికం లేదా అజ్ఞానం కారణంగా ఇలాంటి దారుణాలు జరగడం మనసుకు బాధ కలిగిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తప్పవు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ, బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. సమాజం కూడా ఇలాంటి అన్యాయాలను నిరోధించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్‌ జిల్లాలో అంగన్‌వాడీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై కూడా మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని, దోషులను కఠినంగా శిక్షించాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. చిన్నారి ఇంటికి చేరుకుని కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. బాధిత చిన్నారికి తగిన వైద్య, మానసిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండదు.. చిన్నారులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *