బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో 32ఏళ్ల జైలు

– నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు

నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌22:  ‌పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్‌పై అత్యాచారం కేసులో దోషికి 32యేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు 75వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇంఛార్జీ జడ్జి రోజారమణి తీర్పును వెలువరించింది. 2022 లో నల్లగొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని జరిగిన బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో ఈతీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2022 సెప్టెంబర్‌ 20‌న నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం కు చెందిన బాలిక నల్లగొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో కిడ్నాప్‌నకు గురైంది. పోలీసుల విచారణలో పానగల్‌ ‌కు చెందిన గురిజాలా చందు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో చందుపై అదే రోజు నల్లగొండ టూ టౌన్‌ ‌పీఎస్‌ ‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దఫాలుగా కేసు విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు.. తుది తీర్పును బుధవారం వెలువరించింది. సాక్ష్యాలు విన్న తర్వాత తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి రోజారమణి.. నిందితుడు చందూను దోషిగా తేల్చింది.. అతనికి 32ఏళ్ల కారాగార శిక్ష విధించింది. 75వేల రూపాయల జరిమానా తోపాటు బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ‌తరుపున స్పెషల్‌ ‌పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వేముల రంజిత్‌ ‌కుమార్‌ ‌వాదనలు వినిపించారు. ఐవోలుగా ఏమి రెడ్డి రాజశేఖర్‌ ‌రెడ్డి,డి. చంద్రశేఖర్‌ ‌రెడ్డి, ప్రస్తుత ఎస్‌.‌హెచ్‌.ఓ ‌సైదులు, సి.ఐ రాఘవరావు వ్యవహరించారు. లైసెన్‌ ఆఫీసర్‌ ‌మల్లికార్జున్‌, ‌నరేంధర్‌,‌సి.డి.ఓ సుమన్‌, ‌భరోసా లీగల్‌ ఆఫీసర్‌ ‌కల్పన ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *