– మేం వచ్చాక ప్రత్యేక పాలసీ తెచ్చాం
– ఇక్కడ పెట్టుబడులు పెట్టండి.. రక్షణ ఉంటుంది
– టూరిజం కాంక్లేవ్`2025లో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక పాలసీ లేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శిల్పారామంలో జరిగిన టూరిజవస్త్రం కాంక్లేవ్-2025లో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును అభినందిస్తున్నానన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ.. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. లాభాలు పొందండి అని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ సేఫె˜స్ట్ ప్లేస్. మీ పెట్టుబడులకు ఇక్కడ రక్షణ ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. అంతకుముందు కాంక్లేవ్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, పర్యాటకల్ణరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఈ కాంక్లేవ్‌లో రూ.15,279 కోట్ల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మొత్తం 30 ప్రాజెక్టులు ఎంఓయూ చేసుకున్నాయి. ప్రధాన ఆకర్షణలు: అనంతగిరిలో లగ్జరీ వెల్‌నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, రామోజీ ఫిలిం సిటీ రూ.2,000 కోట్లతో విస్తరణ. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్ కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్‌కుి రానున్నాయి. పదివేల కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు.
పర్యాటకులకు తెలంగాణ స్వర్గసీమ : భట్టి విక్రమార్క
ఓవైపు కృష్ణ.. మరోవైపు గోదావరి.. రెండు జీవ నదుల మధ్య ఉన్న డక్కన్ పీఠభూమి తెలంగాణ పర్యాటకులకు స్వర్గసీమ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గలగల పారే జీవనదులు, ఆకుపచ్చని సౌందర్యంతో నిండిన సుందర అటవీ ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు ప్రపంచాన్ని తెలంగాణ పర్యాటక రంగం ఆకర్షిస్తున్నదని అన్నారు. గత పదేళ్లు పరిపాలించిన వారు ప్రపంచ పటంలో తెలంగాణ పర్యాటక ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో నిర్లక్ష్యం చేశారని, పర్యాటకులను ఆకర్షించకుండా గాలికి వదిలేసారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ పర్యాటకులను ఆకర్షించేందుకు సకల ఏర్పాట్లు చేసి తెలంగాణ రైజింగ్ నినాదంతో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నా, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా ఎందుకో పాపం రాష్ట్రంలోని కొందరు అభినందించాల్సింది పోయి ఆందోళన చెందుతున్నారని భట్టి చురకలంటించారు. వాతావరణం, భాష, శాంతిభద్రతలు, మానవ వనరులు వంటి అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అనుకూలమైనవి అన్నారు. రాష్ట్రం అన్ని సంస్కృతులను, ఆచారాలను అక్కున చేర్చుకుంటుందని వివరించారు. రాష్ట్రంలో ఉన్న మేధోసంపత్తి, అద్భుతంగా ఎదుగుతున్న సాఫ్ట్‌వేర్ రంగం, సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని చెప్పారు. వెల్‌నెస్ సెంటర్లు, హాస్పిటల్ టూరిజం, ఎకో టూరిజం వంటి అద్భుత ఆదాయం సృష్టించే ప్రక్రియను, దేశంలోని సంస్కృతులను పరిచయం చేసే ప్రక్రియను తెలంగాణ పర్యాటక శాఖ చేపట్టింన్నారు. పర్యాటక రంగంలో రూ.50 వేల కోట్లకు పైబడి పెట్టుబడులు ఆకర్షిస్తూ తెలంగాణ పర్యాటక శాఖ దూసుకుపోతోందన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పెట్టుబడిదారుల సంక్షేమాన్ని, రాష్ట్రానికి వస్తున్న పర్యాటకుల రక్షణను ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, నిథమ్ వెంకటరమణ, పారిశ్రామికవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





