– ఓపెన్ బిడ్లు పిలవలేదు
– వేల ఎకరాలు అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్
– బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్లాన్ వేసిందంటై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఏకంగా రూ.15వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ రేవంతు రెడ్డి ప్రభుత్వం మరో స్కాంకు తెరలేపిందని ఆరోపించారు.లక్షల కోట్ల విలువ చేసే వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు రేవంతు మార్కు భారీ స్కెచ్ వేసిందని, ఓపెన్ బిడ్లు పిలచి అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదుని దుయ్యబట్టారు. టెండర్లు పిలిచింది లేదు,..నిబంధనలు పాటించింది లేదన్నారు. ఇద్దరు, ముగ్గురిని మాత్రమే కన్సల్టెంట్స్‌గా పెట్టుకొని పనులను సీక్రెట్‌గా ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది అని ఆయన నిలదీశారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి.. ప్రభుత్వ భూములను, ప్రజా ధనాన్ని ఎవరికి దోచి పెడుతున్నారు.. అని ప్రశ్నించారు.
లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్, వైన్ యార్డు రిసార్ట్స్, లగ్జరీ హోటల్స్, వాటర్ ఫ్రంట్ రిసార్ట్స్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కుల అభివృద్ది పేరిట మీరు చేస్తున్నది ముమ్మాటికీ స్కామే.. కమీషన్ల దందానే.. ఈ స్కాంకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతాం.. రేవంత్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఈ మొత్తం స్కాంపై విచారణ జరిపిస్తం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటం. పబ్లిక్ మనీని రికవరీ పెడతమని హరీష్‌రావుత హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





