– హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్ల ఎత్తివేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మంది ప్రజలను గోదె-కి ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో కమిషనర్ ఆర్.వి.కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో మూసీ నదిలో నీటి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఓ గంట తర్వాత మళ్లీ భారీ వర్షం పడిరది. భారీ వర్షాల నేపథ్యంలో జన జీవనం అస్తవ్యస్తం అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు భారీ వరద వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రెండు జలాశయాలకు సంబంధించి నాలుగు గేట్ల చొప్పున తెరిచారు. మూసీకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నేడు, రేపు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అమ్రత్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





