భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

– బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌ 26: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌ మహానగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలంటూ సీఎస్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

బతుకమ్మ కుంట ప్రారంభం 28కి వాయిదా

వర్షం కారణంగా శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించాల్సిన అంబర్‌పేట్‌ బతుకమ్మ కుంట, ఎస్టీపీల కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఈమేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీన వీటిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *