స్థానిక ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం

– నేతలను అలర్ట్ ‌చేసిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌
‌- ముఖ్యుల‌తో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావుల టెలి కాన్ఫరెన్స్

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌25: ‌స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం అయ్యింది. పార్టీ శ్రేణులను,కార్యకర్తలను అలర్ట్ ‌చేసింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  ‌సూచించారు. పార్టీ నేతలతో కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అందరితో మమేకమై ఉండే గెలుపు గుర్రాలకు పోటీకి అవకాశం కల్పించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ప్రజలు భారత రాష్ట్ర సమితి, కేసీఆర్‌ ‌వైపు ఎదురు చూస్తున్నారన్నారు. హాలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పల్లె ప్రగతి పేరిట గ్రాణ ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి హయాంలో చేసిన కార్యక్రమాలు, వాటి ఫలితాలు.. ఇప్పుడు పల్లెల్లో పరిస్థితిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు. బతుకమ్మ పండుగకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని, తెలంగాణ సంస్క•తి పట్ల కాంగ్రెస్‌ ‌నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. స్థానికంగా భారత రాష్ట్ర సమితి నేతల ద్వారా బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేసేలా చూడాలని సూచించారు. అదే సందర్భంలో ప్రజలతో నిత్యం సంబంధాలు నెరుపుతూ ముందుడాలని అన్నారు.
———————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *