యాదగిరిగుట్టలో శరనవరాత్రి ఉత్సవాలు

– భక్తుల సౌకర్యార్థం స్వీయ సేవా కియోస్క్ ల ప్రారంభం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ అలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయములో  శ్రీ దేవీ శరనవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ స్వస్తి వాచనము, ఋత్విగ్వరణము, అఖండ దీపారాధన, అంకురారోపణము, మండపారాధన, కలశ స్థాపన శ్రీదేవీ పూజ, బాలాత్రిపుర సుందరీ దేవి, మూలమంత్ర జప, సప్తశతీ, లలితా పారాయణములు నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి, అనువంశిక ధర్మకర్త , అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.సాయంకాలం నవావరణ పజ చతుష్షష్ట్యుపచారయుక్త సహస్రనామార్చన, నీరాజన మంత్ర పుష్పము, తీర్ధ ప్రసాద వినియోగము దేవీ త్రికాల పూజలు నిర్వహించారు. కాగా, యాత్రికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో స్వీయ సేవా కియోస్క్లను ఆలయ ఈ ఓ  వెంకట్రావు ప్రారంభించారు. దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవడం,సేవా టిక్కెట్లు పొందడం, ప్రసాదం కూపన్లు పొందడం, విరాళాలు/హుండీ చెల్లింపులు చేయడం, ఆలయ సమాచారాన్ని తెలుసుకోవడం, మొదలగు సౌకర్యాలను ఈ యంత్రాల ద్వారా భక్తులు పొందవ‌చ్చు. ఈ కియోస్క్‌లను ఆలయ అఖండ దీపం ప్రాంగణములో-3, డోనార్ విభాగంలో- 1 , వ్రత మండపంలో -1, చౌల్ట్రీస్ లో- 1 ఏర్పాటు చేశారు. దీని వలన క్యూలలో నిలబడే సమయం తగ్గి పారదర్శకంగా, వేగంగా సేవలు అందతాయి. భక్తులు క్యాష్‌లెస్ పేమెంట్ (UPI/డెబిట్/క్రెడిట్ కార్డు) ద్వారా ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చని ఈ ఓ తెలిపారు. యాదగిరి మాస పత్రిక (YTD Publications) నూతన కార్యాలయంను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అనువంశిక ధర్మకర్త  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు.

34 రోజుల హుండీ ఆదాయం

భక్తులు స్వామివారి హుండీలో వేసిన మొక్కులు 34 రోజుల హుండీ ఆదాయం అధికారులు లెక్కించారు. ఆలయ ఈవో వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం హుండీ ఆదాయ వివరాలు. నగదు రూపేణా  రూ.2 కోట్ల 83వేల 825, .మిశ్రమ బంగారం 65 గ్రాములు, మిశ్రమ వెండి  2 కిలోల 800 గ్రాములు రాగా. విదేశీ కరెన్సీ అమెరికా – 540 డాలర్లు, ఇంగ్లాండ్ –95 పౌండ్లు.నేపాల్- రూ.10. సౌదీ అరేబియా – 6 రియాల్ఒమన్ – 401 రియాల్. మలేసియా – 40 రింగ్గిట్స్. యూరో – 5 యూరోలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – 155. కెనడా – 70 డాలర్. ఇరాక్ – 250 దినార్ వచ్చింది.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *