– ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దీక్ష చేస్తున్న అశోక్
– హాస్పిటల్లో పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన అశోక్‌ను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఆరు రోజుల నుండి దీక్ష చేస్తున్నారు.. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దంటూ దీక్ష విరమించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. డాక్టర్స్ కి
యువతలో ఆందోళన ఉంది.. సమస్టిగా పోరాడదాం అని అశోక్‌కు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ అశోక్ గతంలో కూడా నిరుద్యోగుల కోసం పెద్ద ఉద్యమాలు చేసిన బిడ్డ అని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వనస్థలిపురం హాస్పిటల్లో సదుపాయాలు కూడా సరిగాలేవని తెలిపారు. పరామర్శించడానికి వచ్చి నిరుద్యోగులకు అండగా నిలబడిన ఈటలకు అశోక్ దధన్యవాదములు తెలిపారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని, చదువుకోవడానికి ఉద్యమం.. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఉద్యమం.. పరీక్షలు సరిగా నిర్వహించాలని ఉద్యమం.. నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇవ్వాలని ఉద్యమం.. రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకలపై ఉద్యమం.. చివరికి కోర్టుల్లో కేసుల కోసం ఉద్యమం చేయాల్సి వస్తోందని అన్నారు. ఆనాటి ప్రభుత్వం గ్రూప్`1 పరీక్ష కోసం జీవో 55 ప్రకారం 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఈనాటి ప్రభుత్వం మరో 64 ఉద్యోగాలు చేర్చి జీవో నంబర్ 29 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తే ఒకే సెంటర్లో పరీక్ష రాసినవారికి ఎక్కువ ఉద్యోగాలు ఎలా వచ్చాయి అని నిరుద్యోగులు అడిగే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. పరీక్షల నిర్వహణపై జరిగిన అవకతవకలకు కోర్టు వేసిన మొట్టికాయలే సజీవ సాక్ష్యమన్నారు. ఆనాటి ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ప్రముఖ పాత్ర పోషించినవారు నిరుద్యోగ యువత. ఆరు నెలలకు ఒక నోటిఫికేషన్ ఇస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికారు. రెండేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. రాజకీయాలకే సమయం సరిపోతోంది తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అశోక్ దీక్షను ప్రభుత్వం విరమింపచేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




