విదేశాలపై ఆధారపడడమే పెద్ద తప్పు

– అదే మనకు అతిపెద్ద శత్రువు
– ట్రంప్‌ వీసా ఛార్జీల పెంపుపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక

గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 20: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము విధించటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటినుంచో చెబుతున్నానన్నారు. గుజరాత్‌లో పర్యటించిన సందర్భంగా శనివారం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనమంతా కలిసి ఆ శత్రువును జయించాల్సిన అవసరం ఉంది. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలం అవుతుంది. మనమంతా కలిసి భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలా మార్చాలి. ఇతరులతో కలిసి నడుద్దాం కానీ.. ఆత్మాభిమానంతో బతుకుదాం. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల విూద వదిలేయబోం అని స్పష్టం చేశారు. నేడు భారత్‌ విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడిరచాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *