వామనరావు దంపతుల హత్య కేసు

– మంథని కోర్టులో సమాచారం తీసుకున్న సీబీఐ

పెద్దపల్లి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్‌ ‌వామన్‌ ‌రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్‌ ‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్‌ ‌రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్‌రావు ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్‌ ‌రావు తండ్రి కిషన్‌ ‌రావు, తమ్ముడు చంద్రశేఖర్‌ ‌నుంచి వివరాలను సిబిఐ అధికారులు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *