తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

– 21న వేయి స్తంభాల గుడిలో తొలి బతుకమ్మ
– గిన్నిస్‌ ‌బుక్‌లో చోటు దక్కేలా సంబురాలు
– మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

=హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18:  ‌బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్క్నతి అని, ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగలో పెద్దఎత్తున పాల్గొని ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.  ఈ నెల 21వ తేదీన వరంగల్‌ ‌జిల్లాలోని వెయ్యి స్తంభాల ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. గిన్నిస్‌ ‌బుక్‌ ‌రికార్డులో చేరే విధంగా సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు డియాతో మాట్లాడారు. కొత్తగా కవులను, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్‌ ‌చేస్తామని పేర్కొన్నారు. బతుకమ్మ జరిగే ప్రాంతంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో కూడా మన సంసృతి తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బతుకమ్మ పండుగలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. బతుకమ్మ పండుగ చేసుకున్న తర్వాత చెరువులో వదలాలని…అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బతుకమ్మ పండుగపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం అందరూ కలిసి ఆత్మీయంగా చేసుకోవాలని. ఇది వ్యక్తుల కార్యక్రమం కాదు అందరి పండుగ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొందరు బతుకమ్మ పండుగను రాజకీయం చేశారని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. వివిధ రకాల పాటలతో బతుకమ్మను రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ అని ఉద్ఘాటించారు. మొదటిరోజు చేసుకునే ఎంగిలి పువ్వు బతుకమ్మ దగ్గరి నుంచి చివరి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ముందుకు వెళ్లాలని సూచించారు. బతుకమ్మ పండుగపై కొన్ని అపోహలు ఉన్నాయని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ పండుగ.. తెలంగాణ సంప్రదాయమని చెప్పుకొచ్చారు. బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట బతుకమ్మ కోసం మళ్లీ వచ్చిందని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *