– పోస్టర్ విడుదల చేసిన దిల్‌రాజు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్16: తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణలోని యువ సృజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల్లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిలిమ్స్‌కు పంపించాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుసూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్టస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు తెలంగాణ చరిత్ర, సంస్క•తి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలను పంపించాలని దిల్ రాజు సూచించారు. సెప్టెంబరు 30వ తేదీలోపు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోగా అందిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ సభ్యులు వీక్షించి ఎంపిక చేస్తారని దిల్ రాజు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులోనూ అనేక రకాలుగా ప్రోత్సహం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను దిల్‌రాజు మంగళవారం విడుదల చేశారు. పోటీలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్‌కు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష చొప్పున అందిస్తారని వివరించారు. మరో ఐదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారని ప్రకటించారు. వీటితో పాటు బహుమతి గ్రహీతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





