కంచె చేనుమేస్తే.. కాపలదారుడే దోపిడీ చేస్తే

“డెమోగ్రాఫిక్ మార్పులలో ఎన్నికలలో గెలవలేమని పాలకులకు అర్థమవుతుంది. అధికారాన్ని కాపాడుకొనుట కోసం చేయాల్సిన విష ప్రయోగాలన్నీ అయిపోయాయి.. ఏకంగా తమకు అనుకూలంగా లేరు అని అనుమానిస్తున్న ప్రజల వోట్లను తొలగించడం అనే కొత్త ఎత్తుగడకు తెర లేపారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో లక్షల వోట్లు తొలగించారు. తదుపరి ఎన్నికల కమిషన్ బహిరంగ క్షమాపణ చెప్పి చేతులు దులుపుకుంది. నేడు బీహార్ లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్) పేరుతో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రాజకీయ పరిస్థితి లేకపోవడంతో లక్షల వోట్లను తొలగించారు. భారత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ఆధార్ గుర్తింపును కూడా పనికిరానిదిగా చేస్తూ బతికిన వారిని చనిపోయినట్లుగా చూపిస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారి వోట్లను తొలగించారు. మరొకవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈవీఎంల మాటున డిజిటల్ రిగ్గింగ్ పాల్పడుతుంది.”

గత కొంతకాలంగా వోటు కేంద్రంగా చర్చ జరుగుతూ ఉంది .సహజంగా ఎన్నికల సందర్భంలో వోట్లను ప్రలోభాలకు గురి చేయడము వోట్ల రిగ్గింగ్ పై పార్టీలు ఒకరిపై నొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటాయి లేదా ఎన్నికలను పరిశీలిస్తున్న స్వచ్ఛంద సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి కానీ ఇప్పుడు వోటు ప్రధాన రాజకీయ ఎజెండాగా మారింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఎంతో పోరాటం సాధించిన అందరికీ వోటు ప్రజాస్వామ్యం బలోపేతం లో ఒక ముందడుగు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లో వోటే కీలకమైన ఆయుధం .ఒక వ్యక్తి ఒక వోటు ఒక విలువ సూత్రం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు. సామాజిక న్యాయం, సమానత్వం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించే ప్రక్రియ. ఆ ప్రక్రియ ను స్వార్ధ రాజకీయాల కొరకు గత 75 సంవత్సరాలుగా వివిధ పార్టీలు ఉపయోగించుకుంటున్నవి.

ఇప్పటివరకు అధికారాన్ని కొద్దిమంది చేతుల్లోకి లాక్కున్నారు నేడు వోటును కూడా తమ చేతుల్లోకి లాక్కుంటున్నారు . ఎన్నికల ప్రక్రియలో ఒక దశలో సంక్షేమ పథకాల వాగ్దానాలతో పాటు మద్యం పంపకాలు అదిరింపులతో వోటు వేయించుకునేవారు. మరో దశలో బెదిరించి డబ్బులు పoచి వోటు వేయించుకునేవారు బలప్రయోగంతో వోట్లతో సంబంధం లేకుండా తామే వోట్లు వేసుకునేవారు దీన్నే రిగ్గింగ్ అన్నారు .ఈ రిగ్గింగ్ దశ భౌతిక వోట్లను వేసుకోవడం దశ దాటి వోటర్లను మతమనే మానసిక హిప్నాటిజానీకి గురిచేసి మనుషుల మెదడులను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేశభక్తి, దైవభక్తి, ప్రాంతీయ భక్తి పేరుతో, జాతీయ వాదం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టి వోటు వేయించుకున్నారు .మరొకవైపు సాంస్కృతిక రంగంలో సినిమా లతో విద్వేషాలను రెచ్చగొట్టి పుల్వామా , పహల్గాం లాంటి ఘటనలను చూపి తామే దేశభక్తులంగా తామే దేశ రక్షకులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వోట్లు వేసుకున్నారు.

గత దశాబ్ద కాలంగా వోటు విలువను రాజకీయ పార్టీలు నాశనం చేస్తూ వచ్చాయి .కేంద్రంలోని బిజెపి.. రాష్ట్రం లో బిఆర్ఎస్ లు రాజకీయాలను ఎన్నికలు- వోటు – నోటు – అమ్ముడు- కొనుడు – అధికారం – కాంట్రాక్టులు- కమీషన్ల చుట్టూ తిప్పారు. ఈ ధోరణి దేశ సార్వభౌమత్వానికి ఆర్థిక ,సామాజిక అభివృద్ధి కి కలుగజేస్తున్న నష్టాన్ని గమనిస్తున్న యువ జనాభా ఆలోచనలు మారుతూ వస్తున్నవి. ఈ డిజిటల్లైజేషన్ యుగంలో సమాచార రంగంలో వచ్చిన ఆధునిక ఆలోచనలతో దేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. పాలనా రంగంలో వైపల్యాలు, ప్రధానంగా లోపిస్తున్న అకౌంటబిలిటీ పారదర్శకత లేకపోవడం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం కావడం ,పర్యావరణ సమతౌల్యం పట్టించుకోకపోవడం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో కార్పొరేటీకరణ పెరుగుతున్న నిరుద్యోగం వనరుల తాకట్టువంటి అంశాలు నేడు ప్రజా ఎజెండాలో ప్రధాన చర్చగా మారుతున్నవి. యువజన సామాజిక చైతన్య ఉద్యమ స్ఫూర్తి పెరుగుతుంది. డెమోగ్రాఫిక్ మార్పులలో ఎన్నికలలో గెలవలేమని పాలకులకు అర్థమవుతుంది అధికారాన్ని కాపాడుకొనుట కొరకు చేయాల్సిన విష ప్రయోగాలన్నీ అయిపోయాయి ఏకంగా తమకు అనుకూలంగా లేరు అని అనుమానిస్తున్న ప్రజల వోట్లను తొలగించడం అనే కొత్త ఎత్తుగడకు తెర లేపారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో లక్షల వోట్లు తొలగించారు తదుపరి ఎన్నికల కమిషన్ బహిరంగ క్షమాపణ చెప్పి చేతులు దులుపుకుంది.

నేడు బీహార్ లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్) పేరుతో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రాజకీయ పరిస్థితి లేకపోవడంతో లక్షల వోట్లను తొలగించారు భారత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే ఆధార్ గుర్తింపును కూడా పనికిరానిదిగా చేస్తూ బతికిన వారిని చనిపోయినట్లుగా చూపిస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారి వోట్లను తొలగించారు .మరొకవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈవీఎంల మాటున డిజిటల్ రిగ్గింగ్ పాల్పడుతుంది. రాత్రికి రాత్రి తమ అనుకూల వోటర్లను ఏ రాష్ట్రం నుంచి అయినా దించుకుంటుంది. ఒక గది మాత్రమే ఉన్న ఇంటిలో డజన్ల కొద్ది వోట్లు ఒకే నెంబర్ ఇంట్లో వందలాది వోట్లు నెంబర్ లేని ఇంట్లో కూడా వోటర్లుగా నమోదు చేసుకున్నారు.

ఒక్క వ్యక్తి నాలుగైదు వోట్లు వేసుకునేట్టుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కు ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. ఒక వ్యక్తి ఒక విలువ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. .ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన న్యాయవ్యవస్థ, మీడియా ,కార్యనిర్వాహక ,ఎలక్షన్ కమిషన్ ను తమ గుప్పిట్లో పెట్టుకుని డిజిటల్ రిగ్గింగ్ కు, వోటు చోరికి పాల్పడుతున్నారు .ప్రజాస్వామ్య పునాదులను కూల్చి వేస్తున్నారు . ఈ ప్రమాదకర పరిస్థితి లో ప్రజాస్వామ్య పరిరక్షణ కు పూనుకోవాల్సింది పౌర సమాజమే. ప్రజలను చైతన్యవంతులు చేయడమే ఏకైక మార్గం
ధర్మార్జున్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ జన సమితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *