హైదరాబాద్‌లో కుండపోత వర్షం

– విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్‌, ‌వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపుర్‌ ‌మెట్‌ ‌తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి విజయవాడ-హైదరాబాద్‌ ‌జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. నగర శివారులోని హయత్‌నగర్‌ ‌నుంచి సిటీవైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. యాకుత్‌పురాలో ఓ చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆరేళ్ల బాలిక పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడింది. బాలిక వెనుక వస్తున్న ఓ మహిళ ఇది గమనించారు. వెంటనే అప్రమత్తమై చిన్నారిని బయటకు తీశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సపంలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *