హోటల్‌ లాకర్‌లో రూ.60లక్షలు దోపిడీ

– మిర్యాల‌గూడ‌లో సంఘ‌ట‌న‌

మిర్యాలగూడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ హోటల్‌లో రూ.60 లక్షల నగదు దోపిడీ జరిగింది. డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హోటల్‌ వైష్ణవి గ్రాండ్‌ నిర్వాహకులు కొద్ది రోజులుగా తమ వ్యాపారాల ద్వారా వచ్చిన నగదును హోటల్‌ మొదటి అంతస్తులోని లాకర్‌లో భద్రపరిచారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ దుండగుడు హోటల్‌లోకి ప్రవేశించి గది తలుపులు, లాకర్‌ తాళం పగులగొట్టి నగదు తీసుకెళ్లినట్లు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒకే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *