– జూబ్లీహిల్స్ అపోలోలో చేరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్ అస్వస్థతకు గురయ్యారు. కాళేశ్వరం కేసుపై అధికారులతో సమావేశమైన ఆయన సమావేశం అనంతరం శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుండి శనివారం తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలియడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీబీఐ సీనియర్ అధికారులు అపోలో ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





