న్యూదిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శనివారం భేటీ అయ్యారు. జపాన్, చైనా దేశాల పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగొచ్చిసిన ప్రధాని మోదీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్జిన్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ 25వ వార్షిక సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సంస్థ అభివృద్ధి వ్యూహం, గ్లోబల్ గవర్నెన్స్‌లో సంస్కరణలు, ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారం, సుస్థిర అభివృద్ధిపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





