రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

– యాదాద్రి సహా ప్రధాన ఆలయాల మూసివేత
యాదగిరిగుట్ట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌6: ఆదివారం రాత్రి సంపూర్ణ చందగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన, ఉప, అనుబంధ ఆలయాలను మధ్యాహ్నం నుంచి  మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చన నిర్వహించనున్నారు.  ఆదివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. ఆ తర్వాత తలుపులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాల బ్యాచ్‌ను ‌రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని తెలిపారు. వేములవాడ ఆలయం కూడా మూతపడనుంది. మధ్యాహ్నం ఆలయం మూసివేసి సోమవారం తెల్లవారు జామున తెరుస్తామని ప్రకటించారు. తిరుమల, శ్రీశైలం, కనకదుర్గ, ఇలా ప్రధాన ఆలయాలన్నీ మూసివేయనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *