భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

– రూ.12 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌, ముడిస‌ర‌కు స్వాధీనం

ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో భారీ డ్రగ్స్‌ ఫ్యాక్టరీని అధికారులు సీజ్‌ చేశారు. మహారాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు నగరం స‌మీపంలోని చర్లపల్లిలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32 వేల లీటర్ల ముడిసరకును కూడా సీజ్‌ చేశారు. దీనికి సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు. గత నెలలో మహారాష్ట్ర పోలీసులు బంగ్లా దేశ్ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశారు. వారి నుండి 100 గ్రాముల డ్రగ్స్‌తోపాటు రూ.25లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతోనే నగరంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నిందితుల్లో ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస్‌, అతని సహచరుడు తానాజీ పాథే ఉన్నట్లు తెలుస్తోంది. వాగ్దేవి ల్యాబ్స్‌ అనే కెమికల్‌ ఫ్యాక్టరీ పేరుతో లైసెన్సు తీసుకుని ఎండీ, ఎక్స్‌టాసీ, మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ తయారు చేసేందుకు కావలసిన ముడి పదార్థాలు భారీగా లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్‌ను అధికారులు గుట్టురట్టు చేశారు. ఇక్కడినుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు గర్తించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *