పాక్‌లో అట్టహాసంగా వినాయక నిమజ్జనాలు

కరాచీ,సెప్టెంబర్‌ 6: మన దేశంలోనే కాదు.. పాకిస్థాన్‌ ‌లో కూడా కొందరు హిందువులు వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. అంతేకాదు.. వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం భారీ వినాయక విగ్రహాన్ని ఓ ఆటోలో పెట్టి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు  ఆ సమయంలో గణపతి బొప్పా మోరియా అంటూ సాంప్రదాయ ధోల్‌ ‌సంగీతానికి నాట్యం చేశారు. వారిని చూసి రోడ్డు ద ఉన్న చాలా మంది ముస్లింలు ఆశ్చర్యపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ ‌డియాలో పోస్ట్ ‌చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.ఈ వైరల్‌ ‌వీడియోను కేవలం మూడు రోజుల్లోనే కోట్ల మంది వీక్షించారు. 14 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్‌ ‌చేసి తమ స్పందనలను తెలియజేశారు. అన్ని ధర్మాలకు చోటివ్వడం మానవ ధర్మం అని ఒకరు కామెంట్‌ ‌చేశారు. పాకిస్థాన్‌లోని వినాయకుడి విగ్రహం ఎలా దొరికింది అంటూ ఒకరు ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలని మరొకరు కామెంట్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *