– శోభాయమానంగా గనేష్ నిమజ్జనోత్సవం
– ట్యాంక్ బండ్ పరిసరాల్లో పండుగ శోభ
– మధ్యాహ్నానికి బడా గణేష్ నిమజ్జనం పూర్తి
– మధ్యాహ్నానికి బడా గణేష్ నిమజ్జనం పూర్తి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 6: వినాయ నిమజ్జన ఘట్టం కన్నుల పండువగా సాగింది. కేరింతలు, డ్యాన్సులు, భక్తి పారవశ్యం మధ్య చిందులేస్తూ సాగరతీరానికి సాగినయాత్ర కనువిందు చేసింది. ఉదయం మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో తెలుగు రాష్టాల్ల్రో్ర ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. ఇక ఈ ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్‌దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ దుగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్ మార్గ్‌లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఖైరతాబాద్ మహా గణపతికి నభూతో నభవిష్యతి అనేలా కనివినీ ఎరుగని రీతిలో భక్తజనం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి క్రేన్ పాయింట్ 4 దగ్గర బడా గణపతి నిమజ్జనం అనుకున్న సమయానికే ప్రశాంతంగా ముగిసింది. వేలాది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మళ్లీ తిరిగి రావయ్యా వినాయకా.. అంటూ వైభవోపేతంగా సాగనంపారు. నిమజ్జనానికి ముందు ఉత్సవ సమితి సభ్యులు శాస్త్రోక్తంగా తుదిపూజలు నిర్వహించారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనమిచ్చాడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల 71వ సంవత్సరం. కోట్లాది మంది భక్తులను నవరాత్రుల్లో బడా గణేషుని దర్శనం చేసుకుని పరవశించిపోయారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం సరిగ్గా ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర ఆరంభమైంది. వెల్డింగ్ వర్క్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ దుగా వినాయకుడి రథయాత్ర కన్నులపండువగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ట్యాంక్ బండ్ చేరుకుంది. సుమారు 70 అడుగుల భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ గణపతిని నెమ్మదిగా ఎత్తి, భక్తుల నినాదాల మధ్య హుస్సేన్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేర్చారు. నగరవ్యాప్తంగా ఉన్న వేలకొద్దీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు రహదారులపై బారులు తీరారు. దీంతో హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. మహగణపతితో పాటు అనేక వినాయక విగ్రహాలు ఒకేసారి దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





