– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
– ఏఐ వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి : ఉడుముల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: జర్నలిజం రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను విరివిగా వాడుతున్నారని, అందులో భాగంగా న్యూస్ రూములు పరివర్తన చెందినందున జర్నలిస్టులు కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో కృత్రిమ మేధలో, టూల్స్ అండ్ టెక్నిక్స్, వర్క్‌షాపును మీడియా అకాడమీ, అదిరా (ADIRA) డాటా లీడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలకు సంబంధించిన జర్నలిస్టులు పాల్గొన్నారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏఐని జర్నలిస్టులు ఉపయోగించుకొని రిపోర్టింగ్‌లో సులభతరమైన పద్ధతులో తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను పాఠకులకు, వీక్షకులకు అందించవచ్చన్నారు. మన రాష్ట్రంలో జర్నలిస్టులకు ఏఐలో శిక్షణ కార్యక్రమం ఇదే మొదటి ప్రయత్నమని చెప్పారు. ఏఐ సాంకేతికతపై లోతైన నైపుణ్యం ఉన్న ఇంటర్నేషనల్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి శిక్షణ నిర్వహించారు. ఏఐ మనసును భ్రమింపజేసి తప్పుడు సమాచారాన్ని, వివక్ష వంటి సమాచారాన్ని అందించే ప్రమాదం కూడా ఉందని ఉడుముల ఉదాహరణలతో వివరించారు. ఆటోమేషన్‌లో భాగంగా ఏఐ ఏజెంట్స్ వస్తున్నాయని, దీని ద్వారా రాబోయే కాలంలో వివిధ రకాల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ఏఐ నైతిక నియమాలు, తదితర అంశాలకు లోబడి జర్నలిస్టులు బాధ్యతా యుతంగా కృత్రిమ మేథ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





