హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I.) వర్క్‌షాప్ – టూల్స్ & టెక్నిక్స్ శిక్షణ కార్యక్రమం ఈనెల 3వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియం 5వ అంతస్తులో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్‌షాప్ లో జర్నలిజం రంగానికి సంబంధించిన ఆధునిక టూల్స్, టెక్నిక్స్, వృత్తిపరమైన నైపుణ్యాలపై నిపుణులు సవివరంగా మార్గదర్శనం చేయనున్నారు. ఈ వర్క్ షాప్ ను మొదటగా హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టులకు నిర్వహిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే హాజరు కావాలని వెంకటేశ్వర రావు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




