– పాట్నాలో వోటర్ అధికార్ యాత్ర ముగింపు
– మరోమారు మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
పాట్నా,సెప్టెంబర్ 1:వోట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని.. త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ’వోటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు భాజపాకు అనుమతించబోం. అందుకే ఈ యాత్ర నిర్వహించాం. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మహారాష్ట్రలో, కర్ణాటకలో వోట్ల చోరీ జరిగిందని ఆధారాలు సహా చూపించాం. వోట్ల చోరీ అంటే.. హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అన్నట్లే. ఈ వ్యవహారంలో త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేల్చనున్నాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వోటరు అధికార్ యాత్ర’ ముగింపు సందర్భంగా ‘ఇండియా’ కూటమి నేతలు పట్నాలో నిర్వహించిన ‘గాంధీ సే అంబేడ్కర్’ మార్చ్‌ను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో నేతలు అక్కడే ప్రసంగించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ వోట్ల చోరీ ద్వారా గెలవడానికి యత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఓడిపోతుందన్నారు. బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాహుల్ గాంధీ ‘వోటరు అధికార్ యాత్ర’ చేపట్టారు. ఆగస్టు 17న ససారాంలో మొదలైన ఈ యాత్ర.. 25 జిల్లాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల దుగా 1,300 కి.. మేర కొనసాగింది. బిహార్‌లో వోటర్ల జాబితా ’ప్రత్యేక సమగ్ర సవరణ’ పక్రియ మొదలు మహిళా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తుతూ స్థానికులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. వోట్ల దొంగతనం ద్వారానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ ప్రయత్ని స్తున్నారు. వోటర్ చోరీ చేసే మోదీ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ఆయన బీజింగ్‌కు కూడా చేరుకున్నారు. కానీ చైనాలో, అమెరికాలో కానీ.. మోదీని వోటు దొంగ అని.. సింహాసనాన్ని వదిలేయండి అనే అక్కడి ప్రజలు అంటున్నారు అని రాహుల్ అన్నారు. బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్ పక్రియపై తాను హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నట్లు హెచ్చరించారు. మహాత్మాగాంధీని హత్య చేసిన శక్తులే ఇప్పుడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏం జరిగినా.. రాజ్యాంగాన్ని హత్య చేయడానికి అనుమతించము. బీహార్ ఒక విప్లవాత్మక రాష్ట్రం. ఇది దేశం మొత్తానికే ఒక సందేశాన్ని పంపింది. మేము వోటు దొంగతనం జరగనివ్వము అని రాహుల్ అన్నారు. బీహార్ ప్రజలు తమ వోటు హక్కును కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని లేకుంటే.. మోదీ, అమిత్‌షాలు మిమ్మల్ని ముంచేస్తారని ఖర్గే హితవు పలికారు. నేడు ఆయన వోటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ’ప్రధాని మోదీకి దొంగతనం చేసే అలవాటు ఉంది. ఆయన వోట్లను, డబ్బును దొంగిలిస్తారు. అలాగే దేశంలోని బ్యాంకులను దోచుకున్న తర్వాత భారత్ నుంచి పారిపోయిన వారిని వారు జాగ్రత్తగా చూసుకుంటారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వోట్ల చోరీతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రు అప్రమత్తంగా ఉండండి. రు అప్రమత్తంగా లేకపోతే.. మోదీ, అమిత్ షాలు మిమ్మల్ని ముంచేస్తారు అని ఖర్గే అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీలు దేశానికి వోటు హక్కుని తెచ్చారు. మనం ఆ హక్కును కోల్పోకూడదు. దీనికోసం మనం తీవ్రంగా పోరాడాలి. మన వోటు హక్కులకు ఉన్న ముప్పును తొలగించాలి అని ఖర్గే అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





