– సిబిఐ విచారణకు బిజెపి ముందు నుంచే డిమాండ్
– ఆలస్యంగా అయినా స్పందించిన ప్రభుత్వం
~ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య
– 22 నెలల పాటు నిర్లక్ష్యం చేశారన్న ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్1:కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి బిఆర్ఎస్ బాధ్యత వహించాలని బిజెపినేత కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. కాళేశ్వరంపై బిజెపి వైఖరే నిజమని మరోసారి రుజువైందని అన్నారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై బిజెపి సిబిఐ విచారణను కోరిందని, కాంగ్రెస్ మాత్రం బిఆర్ఎస్ ను కాపాడుతూ ఆలస్యం చేసిందని విమర్శించారు. నిజానికి తలవంచి సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగింతకు అంగికరించారని, ప్రభుత్వం వెంటనే సిబిఐకి లేఖ ఇవ్వాలని బండి సూచించారు. గతంలో ఒఆర్ఆర్ టోల్ టెండర్లపై కాంగ్రెస్ సిట్‌ను ప్రకటించిందని, అది నేటికి ఆచరణ రూపంలోకి రాలేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్లా కొనసాగుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన కోరారు. కాళేశ్వరం అవినీతికి ముమ్మాటికీ బీఆర్ఎస్ కారణమని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ సీబీఐ విచారణను తొలిసారిగా కోరిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ను కాపాడుతూ ఆలస్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐకి లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 22 నెలలు రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, తీరా ఇప్పుడు సీబీఐకి ఇచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వాలని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆధారాలతో సీబీఐకి సహకరించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ధనాన్ని బీఆర్ఎస్ నేతలు మెక్కినదంతా కక్కించాలరు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం అవినీతిలో లేరనే విషయాన్ని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై గౌరవం లేకుండా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడతారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్‌పై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సరికాదని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. కేసీఆర్‌తో రేవంత్ కుమ్మక్కు వలనే సీబీఐ విచారణను ఆలస్యం చేశారని ఆరోపించారు. విధి లేని పరిస్థితుల్లోనే సీబీఐకు అప్పగించారన్నారు. 22నెలలు ఎందుకు ఆలస్యం చేశారో రేవంత్ సమాధానం చెప్పాలని నిలదీశారు. సీబీఐ విచారణపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ అంటే కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని పీసీసీ హోదాలో రేవంత్ అన్నారని గుర్తుచేశారు. వాటిని రేవంత్ రెడ్డి సీబీఐకు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందేనన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





