పీపీటీ ఇచ్చే అవకాశం ప్రతిపక్షానికి లేదు

– వడ్డీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం
– మీడియాతో భట్టి విక్రమార్క చిట్‌ చాట్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్‌ ప్రజంటేషనన (పిపిటి) ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంద‌ర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పీపీటీకి అవకాశం ఇవ్వాలని తాము లేఖ కూడా ఇచ్చామని, అయితే ఆనాడు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పుడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ.6500కోట్లు వడ్డీ కట్టడం లేదని బీఆర్ఎస్ చేస్తోన్న వాదన సరికాదన్నారు. ప్రభుత్వం చెల్లించకపోతే మరి ఆ వడ్డీలు బీఆర్ఎస్ వాళ్లు చెల్లిస్తున్నారా అని నిలదీశారు. బీఆర్ఎస్ అరాచకాలను అసెంబ్లీలో బయట పెడతామని భట్టి అన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *