రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు

– మాగంటి గోపినాథ్‌ సంతాప తీర్మనంలో సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాజకీయంగా పార్టీలు వేరైనా మాగంటి గోపినాథ్‌ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని, విద్యార్థి దశ నుంచే చురుకుగా ప‌నిచేసే వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నుంచి ప్రారంభమైన శాసనస‌భ‌ సమావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్‌ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో ఆయన ఒకరన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. చూడటానికి ఆయన క్లాస్‌గా కనిపించినా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఆయన మాస్‌ లీడర్‌ అని అన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని, 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987-88లో హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారంటూ ఆయన సేవలను కొనియాడారు.
గోపీనాథన ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడని, సినీ రంగంలోనూ నిర్మాతగా రాణించారని, పాత బస్తీ(1995), రవన్న(2000), భద్రాద్రి రాముడు (2004), నా స్టైలే వేరు (2009) వంటి సినిమాలకు గోపీనాథ్‌ నిర్మాతగా వ్యవహరించారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *