– నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్ కమిటీని శుక్రవారం నియమించారు. పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు పాయల్ శంకర్, పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ కార్యదర్శి, అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్ రావులతో కమిటీని ఏర్పాటు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





