కెసిఆర్‌ ‌పాలనలో యూరియా కొరత లేదు

ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లోకి సరఫరా
అసమర్థ పాలనతో ఇప్పుడు అనేక సమస్యలు
ప్రజలకు కూడా కెసిఆర్‌ ‌పాలనంటే తెలిసింది
బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ ‌ముందుచూపు, పాలన అంటే ఏంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని.. రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైందన్నారు. నాడు కేసీఆర్‌ ‌యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి రైల్వే శాఖ వరకు కేసీఆర్‌ ‌స్వయంగా సమన్వయం చేశారని కేటీఆర్‌ ‌చెప్పుకొచ్చారు. చిల్లర రాజకీయాలు చేసే అసమర్థుల వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయి. వందేళ్ల విజన్‌ ఉన్న కేసీఆర్‌కు, బూతులు మాట్లాడే వారికి తేడా ప్రజలకు అర్థమైంది. యూరియా కోసం ప్రత్యేకంగా గూడ్స్ ‌ట్రెయిన్లు, లారీలు ఏర్పాటు చేయించారు. గ్రామాల్లోనే యూరియా సరఫరా చేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి నెలకొంది’ అని కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. ఆగస్టు మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులకు యూరియా ఆవశ్యకత ఏర్పడింది. వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, మిర్చి, బంతి లాంటి పంటలకు యూరియా వేసే సమయం కాబట్టి రైతులు ఎగబడుతున్నారు. సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. డిమాండుకు సరిపడా ఎరువులు లేకపోవడంతో.. దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.కొన్నిచోట్ల రైతులు యూరియా కోసం వారం రోజులుగా పట్టాపాస్‌ ‌పుస్తకాలు, చెప్పులు వరుసలో పెడుతున్నారు. ఇంకొందరైతే అక్కడే నిద్రిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ‌హయాంలో ఏనాడూ కూడా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కలేదు. ధర్నా చేయలేదు. కానీ కాంగ్రెస్‌ ‌పాలనలో మాత్రం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క యూరియా బస్తా కోసం వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు.ఈ పరిస్థితులపై కేటీఆర్‌ ‌స్పందిస్తూ.. కేసీఆర్‌ ‌పాలనను గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌హయాంలో రైతులకు జరిగిన మేలును వివరించారు. వ్యవసాయ అధికారులతో కేసీఆర్‌ ‌వరుస సక్షలు నిర్వహించే వారు. కేంద్రానికి సీజన్‌కు ముందే లెక్కలతో సహా వినతులు ఇచ్చేవారు. ఏపీలోని నౌకాశ్రయాలకు మన ఆఫీసర్లను పంపి ఆదేశాలు ఇప్పించేవారు. దక్షిణమధ్య రైల్వే అధికారులకు స్వయంగా కేసీఆర్‌ ‌ఫోన్లు చేసేవారు. 25 స్పెషల్‌ ‌గూడ్స్ ‌రైళ్ల ఏర్పాటు-కు ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేవారు. పక్కరాష్ట్రం రవాణా శాఖ మంత్రితో నేరుగా సంప్రదింపులు, ఏకంగా 4 వేల లారీలను రంగంలోకి దించేలా సన్నాహాలు చేసేవారు. పోర్టుల నుంచి నేరుగా మండలాలకు తరలించే వ్యూహాలు, ప్రతి రైతుకు సమయానికి యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు. నేరుగా గ్రామాల్లోనే సరఫరా చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు, తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.పరిపాలన తెలియని అసమర్ధులు.. రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు.. కన్నీళ్లు మిగిలాయన్నారు.

తెలుగు జాతీయ, రాష్ట్రీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్
ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీకు ఈ వార్త నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *