– అరెస్టుల పేరుతో నిరంకుశ విధానాలు తగదు
– సమస్యల వలయంలో హైదరాబాద్
– పట్టించుకోని ప్రభుత్వం
– కేంద్ర మంత్రి కిషన్రెడ్డిplease subscribe our channel youtube.com/@prajatantra-news
గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలు, నగర అభివృద్ధి అంశాలపై సచివాలయం ఎదుట బీజేపీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు పోలీసులతో అడ్డుకున్నదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. జిహెచ్ఎంసి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి సేవ్ హైదరాబాద్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ నాయకులు పిలుపునిచ్చిన సందర్భంగా పార్టీరాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను కేంద్రమంత్రి ఖండించారు. అరెస్టులు, గృహనిర్బంధాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు దారుణ స్థితిలో ఉన్నాయి. కరెంట్, మంచినీటి, ట్రాఫిక్ వంటి అన్ని పౌర సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.





