“లాభాలు ఆర్జించడానికి బహుళజాతి సంస్థలు భారత చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి.భారతీయ చిన్న రిటైల్ దుకాణ యజమానులను రక్షించడానికి ఉద్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్, వాల్ మార్ట్ లు ఏకంగా లంచాలిచ్చి భారత్ మార్కెట్‌ను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. .ఏదీ ఏమైనా మార్వాడీ గో బ్యాక్ తో పాటు అమెజాన్ గో బ్యాక్ అనకపోతే మన వాళ్ళకు మార్వాడీలతో కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది.ఇప్పుడు మార్వాడీ గోబ్యాక్ పోరాటం ఎంత ముఖ్యమో.బహుళజాతి కంపెనీల వ్యతిరేక పోరాటం అంతే ముఖ్యం. మల్టీనేషనల్ సంస్థలను బహిష్కరించకుండా.కేవలం మార్వాడీ గో బ్యాక్ నినాదం నినాదంగానే నిలిచిపోతుంది. వెరిసి మార్వాడీలు వదిలేసిన మార్కెట్లు స్థానికులకు దక్కతుందా అంటే అది లేదు.ఆ గ్యాప్‌ను బహుళజాతి కంపెనీలు భర్తీ చేసే ప్రమాదం ఉంది.”
తెలంగాణలో అస్థిత్వ ఉద్యమాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి ..ప్రజలు తమపై ఇతరుల ఆధిపత్యం పెరుగుతుందన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు.స్థానికులపై స్థానికేతరులు డామినేషన్ చేస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పుడు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలు మరోసారి ఉద్యమ బాట పట్టారు.రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పోరుకు సిద్దం అయ్యారు. .ఉమ్మడి ఏపీ, అంతకు ముందు నిజామ్ పాలన.ఇంకొంచెం వెనక్కి వెళ్లితే రాజులు రాజ్యాలు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో అస్థిత్వ పోరాటాలు సజీవంగా ఉన్నాయి.గిరిజన, ఆదివాసీ తెగలు, జాతుల అస్థిత్వ పోరాటాలున్నాయి.ఏళ్ల తరబడి ఆ పోరాటాలు తెలంగాణ ప్రజలకు వారసత్వంగా వస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా అస్థిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిందే. .తెలంగాణ ఉద్యమం అనేక వర్గాల అస్థిత్వ పోరాటాల సమాహారం.ఐక్యంగా లేని ఆత్మగౌరవ పోరాటాలను తెలంగాణ ఉద్యమం ఏకతాటిపైకి తీసుకువచ్చింది.అస్థిత్వ పోటారాలను స్వరాష్ట్ర కాంక్ష కప్పి ఉంచింది.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తమ అస్థిత్వం అంతర్లీనంగా ఉందని ప్రజలందరూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. .స్వరాష్ట్ర ఉద్యమం మొదలైందే ప్రాంతేతరుడి ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ..తెలంగాణలో ఆంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా.. తెలంగాణలో ప్రాంతేతరుల ఆధిపత్యం మర్రి ఊడల్లా పాతుకుపోతుంది.
తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఆధిపత్యం కొనసాగుతుండటంతో అస్థిత్వ పోరాటాలు అలాగే నిరువుగప్పిన నిప్పులా సజీవంగా ఉన్నాయి. .మరోసారి తెలంగాణలో అస్థిత్వ పోరాటం అగ్గి రాజేసుకుంది. రాష్ట్రంలో ఉత్తరాది వ్యాపారులు పంజా విసురుతూ స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నారు.ప్రజలు చైనత్యం కానంత వరకు దోపిడీ దారులు ఎందెందు వెతికన దొరుకుతారు.ఆంధ్ర దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాకా..మరో అస్థిత్వ ఉద్యమాల అగ్గి రాజుకుంటుంది. .’ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’, గైర్ ముల్కీ గో బ్యాక్’ ఉద్యమంలాగా తాజాగా తెలంగాణ ప్రజల బతుకుతెరువును,జీవనాధారాన్ని విధ్వంసం చేస్తూ రాష్ట్రం పై మిడతల దండులా పడి దోపిడీ చేస్తున్న మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అస్థిత్వ పోరాట నిప్పుపుట్టింది. మర్వాడి గోబ్యాక్ ఉద్యమం రాష్ట్రంలో చిలికిచిలికిగా గాలివానలో మారుతుంది.మర్వాడి గోబ్యాక్ ఉద్యమం నిప్పురవ్వలా మొదలైంది.ప్రభుత్వం స్పందించి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ. అస్థిత్వాన్ని కాపాడకపోతే మార్వాడి గో బ్యాక్ నినాదం రాష్ట్రాన్ని కల్చేయవచ్చు.నినాదాన్ని విధానాలతో పరిష్కరించక కుండా.అణిచివేయాలని చూస్తే అది అణ్వాయుధం కంటే ప్రమాదకరంగా మారి ప్రజల తిరుగుబాటుకు దారులు వేస్తుంది.
దేశంలో ఎవరు ఎక్కడైన వ్యాపారం చేసుకోవచ్చు.అది రాజ్యాంగం కల్పించిన హక్కు.అదే సమయంలో వ్యాపారం పేరులో స్థానికులను దోపిడి చేయడం నేరం.ప్రజల వలసలతో పాటు.వారి వస్తువులు వస్తాయి.ఆ వస్తువులతో పాటు ఆ వస్తు సంస్కృతి వస్తుంది.ఆ సంస్కృతి స్థానిక ప్రజల సంస్కృతిపై, అస్థిత్వంపై దాడి చేయనంత వరకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒక సారి ఆ వలస సంస్కృతి తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తు,ఆ ఆధిపత్య తాలుకా వస్తువులు,వ్యాపారం తమ బతుకు తెరువు,జీవనాధారాన్ని విధ్వంసం చేస్తుందన్న అభిప్రాయానికి స్థానికులు వస్తే అది అస్థిత్వ పోరాటానికి దారి తీస్తుంది. .తాజాగా తెలంగాణలో అదే జరిగింది.మార్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక రాష్ట్రంలో మార్వాడి వలస వ్యాపార సంస్కృతి తెలంగాణ ప్రజల బతుకు తెరువు, సంస్కృతిని దెబ్బ తీస్తుంది.తెలంగాణలో లక్షాలది మందికి జీవనాధారం అయిన చిన్న చిన్న దుకాణాలపై మార్వాడి వ్యాపార ఆధిపత్యంతో ప్రజలు ఉపాధి కోల్పోవడమే కాదు..మార్వాడి సంస్కృతిలో తెలంగాణ సంస్కృతి కొట్టుకుపోతుందన్న భయం తెలంగాణ ప్రజల్లో ఏర్పడుతుంది. బడా కంపెనీల అండతో.అర్ధిక,అంగ బలంతో సిండికేట్‌గా ఏర్పడి రాష్ట్రంలో చిన్న చితక వ్యాపారులను దెబ్బతీస్తూ తెలంగాణపై వ్యాపార గుత్తాధిపత్యం సాధిస్తున్నారని అది తమ ఉపాధిని కొల్లగొట్టుగుతుందనే ఆందోళన స్థానికుల్లో ఉంది. .బతుకుతెరువు పోతుందన్న ఆందోళన.సంస్కృతి దెబ్బతింటుందన్న భయం నుంచే మార్వాడీ గోబ్యాక్ అన్న నినాదం పుట్టుకొచ్చింది.ప్రజల ఆవేదనలో నిజం ఉంది.అదే టైంలో వ్యాపారం చేసుకునే హక్కు కూడా మార్వాడీలకుంది. వ్యాపారం, ఆధిపత్యం రెండింటి మధ్య భౌతికంగా తేడాలున్న రెండింటిలో అంతిమ సారంలో మాత్రం ఒక్కటే.సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే అది మరింత జఠిలంగా మారుతుంది.
“దేశంలో ఎవరు ఎక్కడైన వ్యాపారం చేసుకోవచ్చు.అది రాజ్యాంగం కల్పించిన హక్కు.అదే సమయంలో వ్యాపారం పేరులో స్థానికులను దోపిడి చేయడం నేరం.ప్రజల వలసలతో పాటు.వారి వస్తువులు వస్తాయి.ఆ వస్తువులతో పాటు ఆ వస్తు సంస్కృతి వస్తుంది.ఆ సంస్కృతి స్థానిక ప్రజల సంస్కృతిపై, అస్థిత్వంపై దాడి చేయనంత వరకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒక సారి ఆ వలస సంస్కృతి తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తు,ఆ ఆధిపత్య తాలుకా వస్తువులు,వ్యాపారం తమ బతుకు తెరువు,జీవనాధారాన్ని విధ్వంసం చేస్తుందన్న అభిప్రాయానికి స్థానికులు వస్తే అది అస్థిత్వ పోరాటానికి దారి తీస్తుంది.”
.అయితే,తెలంగాణకు మార్వాడీలే సమస్య కాదు.అంతకు మించిన సవాల్ మల్టీనేషన్ కంపెనీల రిటైల్ స్టోర్స్ రూపంలో రాష్ట్రానికి కాదు దేశానికి ప్రమాదకరంగా ఉంది. మార్వాడిలో సముద్రంలో చేపలైతే.అమెజాన్,వాల్ మార్ట్ వంటి అమెరికా ద్రవ్య కంపెనీలు తిమింగలాలు , సొరచేపలు.అదానీ, అంబానీలు దేశీయ తిమింగలాలైన.వారిని పెంచి పోస్తున్నది సముద్రం మాత్రం అమెరికా సంస్థలే.అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడుదారులే అయిన అమెరికా ద్రవ్య సంస్థల గుత్తాధిపత్యంలో బానిసలే. .తెలంగాణలో మార్వాడిలపై ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత లేదు.వారు చేస్తున్న ఆధిక దోపిడీ,సంస్కృతిక ఆధిపత్యంపై పేచీ ..తెలంగాణ సంస్కృతిని,తెలంగాణ ప్రజల ఉపాధిని కొల్లగొట్టనంత వరకూ మార్వాడీలతో పంచాయితీ లేదు. తెలంగాణాభివృద్దిలో భాగస్వాములుగా వారిని తెలంగాణ నేల గౌరవిస్తుంది. .ఇప్పుడు తెలంగాణలో మార్వాడీల గోబ్యాక్ తో పాటు..విదేశీ బడా దుకుణాలైన అమెజాన్ వంటిని బహిష్కరించే నినాదం అవసరం. లేకపోతే మన దేశ మార్వాడీలను బ్యాన్ చేస్తే అది ఆటోమేటిగ్గా అమెజాన్ వాల్ మార్ట్ వంటి అమెరికా,చైనా,యూరప్ చెందిన బడా రిటైల్ దుకాణాలకు మరింత లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.మన వాళ్ళును కొట్టి విదేశీ కంపెనీలకు లాభాలు సమకూర్చినట్లు అవుతుంది. .అంతేకాదు ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు తమ లాభాలు, మార్కెట్ అవకాశాల కోసం ఎన్జీవోల పేరుతో చాలా పోరాటాలు నిర్మించి లాభాల లబ్ధి పొందినట్లే.మార్వాడీ గోబ్యాక్ తో అమెరికా సంయుక్త దుకాణాలు తమ లాభాల లబ్ది కోసమే చేస్తున్నాయనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. .మార్వాడీ గోబ్యాక్ తో పాటు అమెజాన్,వాల్ మార్ట్ వంటి దుకాణాలు గోబ్యాక్ అన్నప్పుడే ఆ రెండు వర్గాల దోపిడీకి అరికట్ట వేసి మన వాళ్ల బతుకు పోరాటానికి భవిష్యత్తు భరోసా ఇవ్వొచ్చు.అలా కాకుండా కేవలం మార్వాడీ గోబ్యాక్ అన్నంత మాత్రాన మన వాళ్ల బతుకులు మారవు.వెరసి అమెరికొడి దుకాణాలకు లాభాల పంట పండించినట్లు అవుతుంది.
.ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ లాంటివి,ఫుడ్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించి భారతీయ విస్తరించింది.దేశీయ మార్కెట్లపై గుత్తాధిపత్యం సాధించింది.ఆధునికకాలంలో డేటానే వ్యాపారం.డేటా మేక్ మనీ..ఈ డేటానే మల్టీ నేషనల్ కంపెనీలు వ్యాపార విస్తరణ ఆయుధంగా మార్చుకున్నాయి. మొదట ప్రజలకు ఏం కావాల్నో దాని అతి తక్కువ కాలంలోనే ఇంటికి ముందుకు తెచ్చిన సంస్థలు. తర్వాత తొండముదురి ఊసరవెల్లి అయినట్లు.దేశీయ మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకుని.ప్రజలు ఏం కొనాలో ఆ కంపెనీలు నిర్ణయిస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ మరియు పుస్తకాలు అమెజాన్ ప్రైమ్‌లో వినియోగదారులు వెతుకుతున్న అతిపెద్ద వ్యాపార విభాగాలు. ఫుడ్ డెలివరీ సేవను జోడించడంతో ప్రజలు దాదాపు ప్రతిరోజూ జొమాటో లేదా స్విగ్గీ నుండి ఆర్డర్ చేస్తున్నారు. .ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ , వాల్‌మార్ట్ మధ్య టగ్ ఆఫ్ వార్‌కు భారతదేశం కొత్త యుద్ధభూమిగా మారింది.భారతీయ రిటైల్ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం పోటీ తీవ్రతరం కావడంతో భారత మార్కెట్లోకి కోట్ల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టుతున్నాయి. ..భారత మార్కెట్, ముఖ్యంగా వినియోగ వస్తువుల మార్కెట్లపై బహుళజాతి విదేశీ కంపెనీలచే గుత్తాధిపత్యం సాధించాయి. దేశంలో దశాబ్దాల నాటి బహుళజాతి దిగ్గజాలకు ఎదురుదెబ్బ తగులుతోంది.
టాటా, అంబానీ, అదానీ, బిర్లా మరియు మహీంద్రా వంటి పెద్ద భారతీయ వ్యాపారాలు కూడా విదేశీ కంపెనీలతో కలిసి ఉమ్మడి సరఫరా గొలుసు యంత్రాంగాన్ని అందిస్తున్నాయి. ..జాయింట్ వెంచర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన భారత్‌లో కుటీర పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ ప్రజల స్థానిక ఉపాధిని, జీవనాధారాన్ని దెబ్బ తీస్తున్నాయి. అంబానీ రిలయన్స్ యూనిలీవర్, పెప్సికో, నెస్లే, కోకా-కోలా ,కిరాణా, గృహ, మరియు వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ల పేరుతో వంటి విదేశీ దిగ్గజ కంపెనీలతో చేతులు కలిపి డజన్ల కొద్దీ చిన్న కిరాణా మరియు ఆహారేతర బ్రాండ్లతో జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.రిలయన్స్ సూపర్ మార్కెట్ స్టోర్ ,స్వంత ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్,జియో మార్ట్‌తో,ఈ ఉత్పత్తులను రిలయన్స్ రిటైల్ కన్స్యూమర్ బ్రాండ్ల క్రింద స్థానిక మార్కెట్లోకి వచ్చి కోట్ల మంది ప్రజల ఉపాధిని కొల్లగొట్టుతుంది. ..బడా ఈ కామర్స్ వల్ల మంచి నీరు దొరకని మారుమూల గ్రామాల్లో ఇవాళా కోక కోలా వంటి విదేశీ కూల్ డ్రింక్స్ దోరుకుతున్నాయి..అగ్గిపుల్ల నుంచి స్పేస్ పరికరాల వరకూ ఆన్ లైన్ మార్కెట్లో దోరుకుతున్నాయి..ఆర్థికంగా,సాంకేతిక పరిజ్ఞానంతో బహుళజాతి కంపెనీల పోటీని తట్టుకోలేని దేశీయ రిటైల్ రంగం కుదేలైంది. వినియోగ వస్తువుల వ్యాపారాలలో బహుళజాతి కంపెనీలు గుత్తాధిపత్యం సాధించాయి.
ముందు రాష్ట్రం..దేశం తర్వాత ప్రపంచం.అలా కాకుండా రాష్ట్రం కోసం మన దేశాస్తుడిని కొట్టితే.ప్రపంచం అటు దేశ,ఇటు రాష్ట్ర రెండు మార్కెట్ లను ఆక్రమిస్తుంది..మన దేశ మార్వాడీలతో అయిన మన లోకల్ వాళ్ళు కొట్లాడుతారు కావొచ్చు కానీ సామ్రాజ్యవాద కంపెనీలతో మన వాళ్ళు కొట్లాలేరు.ఇప్పటికే రిలయన్స్,అదానీ లాంటి వారిని ముందు పెట్టి అమెరికా కంపెనీలు దేశ మార్కెట్ ను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.నిత్యావసరాల మార్కెట్ పై గుత్తాధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.ఆ మేరకు కేంద్రంలో రిటైల్ చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. .కేంద్రంలో ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని తమ వ్యాపార అనుకూలంగా చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నారు. లాభాలు ఆర్జించడానికి బహుళజాతి సంస్థలు భారత చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి.భారతీయ చిన్న రిటైల్ దుకాణ యజమానులను రక్షించడానికి ఉద్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్, వాల్ మార్ట్ లు ఏకంగా లంచాలిచ్చి భారత్ మార్కెట్‌ను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. .ఏదీ ఏమైనా మార్వాడీ గో బ్యాక్ తో పాటు అమెజాన్ గో బ్యాక్ అనకపోతే మన వాళ్ళకు మార్వాడీలతో కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది.ఇప్పుడు మార్వాడీ గోబ్యాక్ పోరాటం ఎంత ముఖ్యమో.బహుళజాతి కంపెనీల వ్యతిరేక పోరాటం అంతే ముఖ్యం. మల్టీనేషనల్ సంస్థలను బహిష్కరించకుండా.కేవలం మార్వాడీ గో బ్యాక్ నినాదం నినాదంగానే నిలిచిపోతుంది. వెరిసి మార్వాడీలు వదిలేసిన మార్కెట్లు స్థానికులకు దక్కతుందా అంటే అది లేదు.ఆ గ్యాప్‌ను బహుళజాతి కంపెనీలు భర్తీ చేసే ప్రమాదం ఉంది.
-తోటకూర రమేష్





