వరద సాఫీగా సాగేలా చూడండి

•హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌
•‌నీట మునిగిన ప్రాంతాల పరిశీలన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 :ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదవ్వడంతో నీట ముని గిన అమీర్‌ ‌పేట్‌  ‌మెట్రో స్టేషన్‌ ‌పరిసరాలను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగ నాథ్‌ ‌మంగళవారం పరిశీలించారు. సోమ వారం సాయంత్రం భారీ వర్షానికి జూబ్లీ హిల్స్, ‌కృష్ణానగర్‌, ‌యూసుఫ్‌ ‌గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు, మధురానగర్‌, ‌శ్రీనివాస్‌ ‌నగర్‌ ‌వెస్ట్ ‌నుంచి భారీగా వరద రావడంతో రహదారిపై నీరు నిలిచిందని స్థానిక అధికారులు కమిషనర్‌ ‌కు వివరించారు. 40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు  అమీర్‌ ‌పేట్‌- ‌సంజీవరెడ్డి నగర్‌ ‌ప్రధాన రహ దారి దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకుపోవడంతో ఈ సమస్య తలెత్తి ందని చెప్పారు. అమీర్పేట మెట్రో స్టేషన్‌ ‌కింద నిర్మించిన కల్వర్టులో వున్న పైపు లైన్లలో ఒకటి పూడికతో మూసుకు పోవ డంతో సమస్య తీవ్రమైందన్నారు. వెంటనే పైపు లైన్లలో పూడికను తొలగించాలని కమి షనర్‌ ‌సూచించారు. అప్పటికీ సామర్థ్యం సరిపోకపోతే పైన వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా టన్నెల్‌ ‌మాదిరి పనులు చేపట్టి అదనంగా పైపులైన్లు ఏర్పా టు చేయాలన్నారు. అనంతరం లకి• •కాపూల్‌ ‌ప్రాంతాలను పరిశీలించారు. లకి• •కాపూల్‌ ‌చౌరస్తాలో పైపులైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా పైపులైన్లు వేస్తున్న ప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో ప్రయా ణికులకు ప్రమా దకరంగా మారుతుందని సూచించారు. ఈ వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా తక్షణ చర్యలతో ఉపశమనం లభించేలా, సమ స్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సూచి ంచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *