బీసీ రిజర్వేషన్ల కోసం సంఘటిత పోరు

– బీసీల డిమాండ్ నెర‌వేరే అవ‌కాశం వ‌చ్చింది
– రాజ‌కీయ పార్టీల రెండు నాల్క‌ల ధోర‌ణి
– కాంగ్రెస్ నేత వి. హ‌నుమంత‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 2: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకై బీసీలందరూ సంఘటితంగా పోరాటం చేయడమే ఏకైక మార్గమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. శ‌నివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో డా.నిజ్జ‌న ర‌మేష్ ముదిరాజ్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన  రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఎన్నో సంవత్సరాలుగా బీసీలు చేస్తున్న డిమాండ్ నెరవేరే అవకాశం ఇప్పుడు దగ్గర్లో ఉందని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీలకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ ఏకమై, ఒకే నినాదంతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎల్. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం ముందుకు రావాల్సిన రాజకీయ పార్టీలు రెండు నాలుకల ధోరణి అవలంబించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ అయిన కేంద్రమంత్రి బండి సంజయ్ ‘తొండి సంజయ్’లా మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని ఆరోపించారు. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ లు ఇస్తామంటే బిజెపి పార్టీ మద్దు తు ఇవ్వకుండా మోసం చేస్తున్నది పార్లమెంట్ సమావేశం లో బిల్లు ను ప్రవేశ పెట్టాలని లేకపోతే రాబోయే రోజులు బీసీ లు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
టీజెస్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం ప్రవేశ పెట్టారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ ల రిజర్వేషన్ ల బిల్లు ను ప్రవేశ పెట్టి చట్టం చేసి తమిళ్ నాడు తరహా లో రాజ్యాంగం లో 9వ‌ షెడ్యూల్ చేర్చి బీసీ లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఈ సమావేశం లో తీర్మానం చేశారు. గౌడ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్, బీసీ సంఘాల నేతలు గణేష్ చారి, లక్ష్మణ్ యాదవ్, బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ గౌడ్, మద్దెల సంతోష్ ముదిరాజ్, శివ ముదిరాజ్, జర్జీ రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ నాగేశ్వర్ రావ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహేష్ యాదవ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లె వినయ్, ధర్మార్జున్, బైరి రమేష్, మహిళా జన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య, బీసీ జన సమితి అధ్యక్షుడు జస్వంత్, రైతు విభాగం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ధార సత్యం, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జావేద్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *