– సర్వీసు మరో ఏడాది పొడిగిస్తూ జీవో
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 12,055 ఉద్యోగులకు భారీ ఊరట కలిగింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వారి సేవలను పొడిగించకపోవడంతో సాంకేతిక కారణాలతో జీతాలు ఆగిపోయాయి. కాగా, జీవో జారీతో వారి మూడు నెలల పెండిరగ్ జీతాల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్దిక శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు చేరిన నిధులు చేరాయి. నేడో, రేపో ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి.





