తమను ఎంతో ప్రేమతో ఎన్నుకున్న వోటర్ల వల్ల లోక్‌సభ, రాజ్యసభల పవిత్ర సభల్లోకి వొచ్చిన “గౌరవనీయ సభ్యులు ” గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటు మన దేశ ప్రజల సమిష్టి వారసత్వం. వీరు దాని రక్షకులు, పోషకులు. అయితే ఈ అత్యంత కీలకమైన బాధ్యతను వారు నిజంగా నెరవేరుస్తున్నారా అన్నదే ఈ రోజు ప్రతి భారతీయుణ్ణి తొలుస్తున్న ప్రశ్న
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల నిర్వహణ వీధి రాజకీయాల విన్యాసాలు చొచ్చుకువచ్చినట్టు కనిపిస్తోంది. 17వ లోక్‌సభ (గత పదవీకాలం) కేవలం 55 రోజులు మాత్రమే పని చేసింది మొదటి లోక్‌సభ 135 రోజుల పని రోజులతో పోల్చితే ఇది సగం కన్నా తక్కువ. ఇదే 17వ లోక్‌సభ మరో విషయంలో కూడా చర్చలోనిరించింది 146 మంది ఎంపీలను (లోక్‌సభ, రాజ్యసభ కలిపి) వివిధ కారణాల వల్ల సస్పెండ్ చేశారు. అంతేకాక, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా వంటి ఐదుగురు ఎంపీలను పార్లమెంటు నుండి అనర్హులను కూడా చేశారు.
ఇలాంటి చర్యలు కొత్తవేమీ కావు. 1985 జనవరిలో రాజీవ్ గాంధీ 404 స్థానాలతో అఖండ మెజారిటీతో ప్రధాని అయ్యారు. ఆయన తల్లి ఇందిరా గాంధీ హత్యపై విచారణ చేయడానికి ఠక్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ కమిషన్ నివేదికను ప్రజల ముందుకు తీసుకురాలేదు. దీనిపై ప్రతిపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, స్పీకర్ బాల్‌రాం జాఖర్ 63 మందిని సస్పెండ్ చేశారు. ఇది భారతదేశ చరిత్రలో తొలిసారిగా జరిగింది.
అయితే మరుసటి రోజు మీడియాలో వచ్చిన దుమారం, పౌర సమాజ ఒత్తిడితో ఆ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నారు. కానీ అప్పటి నుంచే ‘శక్తివంతమైన మెజారిటీ’ను దుర్వినియోగం చేసే ధోరణికి బీజం పడింది. మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో ఉన్నప్పుడు 14వ, 15వ లోక్‌సభలలో 50 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తరువాత 16వ, 17వ లోక్‌సభలలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది.ఇలాంటి ప్రజాతంత్ర అననుకూల పరిణామాల వల్ల పార్లమెంటు దిశ తప్పుతుంది. ప్రస్తుత వర్షాకాల సమావేశం నేపథ్యంలో మన పార్లమెంటేరియన్లు తమ విధులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఈ సమావేశం ఎంతో కీలకం. ఇటీవలి పాకిస్తాన్‌తో చోటుచేసుకున్న ఉద్రిక్తత తరువాత మొదటి సమావేశమిది. ఆ సంఘటన మనకు ఏం నేర్పింది? భవిష్యత్తులో ప్రమాదాలకు మనం ఎంతమేర సిద్ధంగా ఉన్నాం? ప్రజలు ప్రభుత్వం నుండి సమాధానాల్ని కోరుతున్నారు. ఇది కేవలం అధికార బెంచ్, ప్రతిపక్షాల విషయం కాదు ఇది జాతీయ భద్రత ప్రశ్న.ఇంకా, ఈ సమావేశంలో పలు అంతర్గత సమస్యలు, ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగనుంది. మన ఎంపీలు నిజమైన చిత్తశుద్ధితో పనిచేస్తే జఠి
మంచులో, తక్కువ వనరులతో మన సైన్యం పోరాడింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకులు, అటల్ బిహారీ వాజ్‌పేయి సహా, నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. కానీ అది విమర్శ కోసం కాదు.. బాధ్యత కోసం. వాజ్‌పేయి తరచుగా నెహ్రూను విమర్శించేవారు అయినా, ఆయన వాక్చాతుర్యాన్ని నెహ్రూ మెచ్చిన సందర్భాలున్నాయి. ఆదే వాజ్‌పేయి, 1971లో ఇండిరా గాంధీని ‘దుర్గాదేవి’గా అభివర్ణించారు. అలాగే 1994లో నరసింహారావు ప్రభుత్వం వాజ్‌పేయిని ఐక్యరాజ్య సమితిలో భారత భద్రతా హక్కులపై పక్షాన్ని ప్రాతినిధ్యం వహించమని పంపింది. ఆయన సమర్ధవంతంగా ఆ పాత్రను నిర్వర్తించారు.
ఈ సంయుక్త శక్తి స్ఫూర్తి ఇప్పటికీ మాయమవలేదని నమ్మకం ఉంది. ఉదాహరణకి, 2025 ఏప్రిల్‌లో ముగిసిన బడ్జెట్ సమావేశాన్ని తీసుకోండి. చివరి రోజు ఏప్రిల్ 4న, రెండూ సభలూ అసాధారణ ఏకాభిప్రాయంతో పనిచేశాయి. ఆ రోజు లోక్‌సభ పనితీరు 118శాతం , రాజ్యసభ 119శాతం . రాజ్యసభలో కార్యాచరణ ఉదయం 11గం. ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 4:02 గం. వరకూ కొనసాగింది ఇదొక అరుదైన ఘట్టం. ఇలాంటి బాధ్యతతో కూడిన ప్రవర్తనను మన ఎంపీలు ప్రస్తుత సమావేశంలో కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం ఆశిద్దాం





