బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నాయకులు శుక్రవారం కలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.





