అందరికీ నాణ్యమైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం – మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 23: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారుశుక్రవారం హెచ్ఐసీసీలో టీవీ 9, క్యాబ్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్ పో – 2025″ను ఆయన లాంఛనంగా ప్రారంభించారువిద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, దాన్ని తిరిగి గాడిలో పెట్టి అందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారురాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి అప్పుడూ… ఇప్పుడూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేసిందన్నారుమన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు 1991 – 1992 లోనే అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ వైపు సర్కార్ బడులను బలోపేతం చేస్తూనే… మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించిందన్నారుప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సర్కార్ బడులను తీర్చి దిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నార.

తెలంగాణ యువత ప్రతిభే మనకు పెద్ద ఆస్తి అని, అందుకే ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారురాష్ట్రంలో ఏటా 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుంటున్నారని, కానీ… వారిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు ఉండటం లేదన్నారుఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలు కృషి చేయాలని సూచించారు

నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దాలని, అందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీతో భాగస్వామ్యం కావాలని కోరారుఉన్నత విద్యపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న టీవీ 9 యాజమాన్యాన్ని ఆయన అభినందించారుఇలాంటి సదస్సులను గ్రామీణ ప్రాంతాల్లోనూ నిర్వహించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారుకార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలాకృష్ణా రెడ్డి, పలు ప్రైవేట్ విద్యా సంస్థలు, టీవీ 9, క్యాబ్ కన్సల్టెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *