పలు గ్రామాల్లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటన

సమస్యల పై స్పందించి  వెంటనే ఆదేశాలు

హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్ , చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో  మంగళవారం పర్యటించారు. చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ను పర్యటించారు. అక్కడ విద్యార్థులకు భరోసా కల్పించారు. వంటగది ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేస్తుండడంతో సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బొమ్మకల్ లో వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలను మంత్రి  దృష్టికి తీసుకొచ్చారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పూర్తి చేశామని త్వరలోనే రైతు భరోసా ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో కార్యకర్తలు మండల ప్రజలతో ముచ్చటించారు.

వారి నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. పలు సమస్యల పై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. తరువాత ఆకునూరు , పెరికపల్లి , సర్వాయిపేట్ , మహ్మదాపూర్ గ్రామాల్లో స్థానిక మహిళలు , వృద్ధులతో ముచ్చటించారు. గోపాల మిత్ర లతో మాట్లాడారు. ఆవుల వృద్ధి కి గోపాల మిత్రల పాత్ర అభినందనీయం అన్నారు. గోపాల మిత్ర లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళా రైతు కూలీల తో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు,బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి  దృష్టికి తీసుకువచ్చారు. హుస్నాబాద్ నుండి  సర్వాయిపేట మీదుగా సైదాపూర్ మార్గంలో ఆర్టీసీ బస్సులు కల్పించాలని కోరారు.

అనంతరం మహమ్మదాపూర్ గ్రామంలో వృద్ధులతో ముచ్చటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 లక్షల నిధులు కేటాయించడంతో అక్కడ జరిగిన పనులను పరిశీలించారు. అండర్ -17 రగ్బీ లో తెలంగాణ నుండి బీహార్ లో ఆడుతున్న అంజలి అనే అమ్మాయిని అభినందించి సత్కరించారు. వారికి ఆర్థిక సహాయం చేశారు. ఎస్సి కాలని లో వాటర్ సమస్య ఉందని స్థానికులకు చెప్పడంతో వెంటనే అధికారులతో మాట్లాడడంతో తక్షణమే అక్కడ బోర్ వేయాలని  అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *