రాయండీ… రాస్తూనే వుండండి

రాయండి….! రాయండి …..!
ఏదో ఒకటి రాయండి
రాయడం ఒక అదృష్టం
రాయడం ఒక ఆనందం
రాయడం ను సాధన చేయండి
రాసే రాతలు చిత్తు కాగితాలను
నింపే విత్తనాలు కానే కావు
ఎందరో హృదయాలను తట్టిలేపే కిరణాలు

చుట్టు ఎంత అందమైన పువ్వులో
హస్తానికి చైతన్యం లేకపోతే
కలము వాడిపోయిన పూవులాంటిదే

ఎడారికీ పోలానికీ తేడా వుండదా
బానిసకీ సుల్తాను స్నేహం వుంటుందా
కాల ప్రవాహంలో రాతలే అలలు
నదీ పారితే ఎడారియైన మెట్టభూమవుతుంది
అంతరం తగ్గితే పూరిగుడిసెకు
మేడకు చెలిమి కుదురుతుంది

కష్టపడి భూమిని దున్ని సేద్యం చేస్తేనే
నాలుగు వేళ్ళు నోట్లోకీ పోయేవి
ఇష్టపడి కలంతో కాగితమును
నింపితేనే నలుగురి మెప్పుపోందేది

రాతలో లోపాలు వున్నాయంటారా
ఉండనివ్వండీ …..
ప్రతి చరిత్ర ఎదో లోపం తోనే మొదలు
విమర్శలోస్తున్నాయనీ విచారమేందుకు
నిప్పులో కాలితేనే కర్పూరం పరిమళించు

రాయండి….! రాయండి …..!
ఏదో ఒకటి రాస్తూ పోండి
రాయలేకపోవడం మనిషీకున్న అవలక్షణం
రాతలేప్పుడు వ్యర్దం కావు
బతికివున్నాన్నాళ్లు రాసి రాసి
చచ్చినా బతికివున్నా వాళ్లేందరో
ఒకొక్కరిని మృత్యువు కబళించినా
వారి రాతలు మాత్రం అమరం

రాయండి….! రాయండి …..!
ఏదో ఒకటి రాస్తూ…….
రాయడం ను సాధన చేయండీ
డా.ఐ.చిదానందం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *