- ఆయన అల్లుళ్ల ప్రయోజనాల కోసం ఫార్మా విలేజ్‌లు
- ఫార్మాలా వన్ గురించి కనీస నాలెడ్జ్ కూడా లేదు
- ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 13:సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ విధానాల వల్ల రాష్ట్రంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాలతోనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి భరతం పడుతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి, అన్న శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. తన ఏడు ఎకరాల భూమి పోతుందనే కలెక్టర్‌ను సురేష్ అడిగాడని.. సురేష్ అనే వ్యక్తి.. బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే అని స్పష్టం చేశారు.
‘‘సీఎం రేవంత్ .. వాడో పిచ్చోడు.. ఫార్ములా వన్ ఈ రేసు గురించి ఆయనకేం తెలుసు. నిఘా వ్యవస్థ వైఫల్యం వలనే లగచర్ల ఘటన.. కలెక్టర్ గన్ మెన్లు ఎక్కడ. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారుల బలికావొద్దు. కలెక్టర్ ప్రతీక్ జ్కెన్కు సురేష్ పద్ధతిగా.. మర్యాదగా చెప్తే తప్పా. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా.సురేష్ మమల్ని కలవటం తప్పు అయితే.. రాహుల్ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్ కలవటం కూడా తప్పే. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జిలను కూడా తప్పుదోవ పట్టిస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ పాలన. రేవంత్ పిచ్చి నిర్ణయాల వలనే కొడంగల్ రగులుతోంది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్.. మహారాష్ట్రకు మూటలు మోస్తున్నాడు. రైతులు అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ. షోలాపూర్ చౌరాస్తాలో నిలబడినా.. రేవంత్‌ను ఎవరూ గుర్తుపట్టరు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
కనీసం సతీమణికి కూడా సమాచారం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తీవ్రవాదుల మాదిరి రైతులను పొలాల వెంబడి తరుముతున్నారన్నారు. ఫార్మా విలేజ్ వలన వొచ్చే లాభమేంటో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పెద్దలను తాను కలవటం తప్పు అయితే.. సీఎం గవర్నర్‌ను కలవటం కూడా తప్పే అని అన్నారు. కొడంగల్ రైతులు ఆరేడు నెలలుగా రగులుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అని చెప్పి.. మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఫార్మా సిటీ నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి చెప్పారు. అయితే సీఎం సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డి మాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసమే ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు వెళ్ళని రేవంత్.. మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మాత్రం వెళ్తారన్నారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్తుంటే.. ఐజీ దాడి జరిగిందంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్మాసిటీపై కేసీఆర్ ముందు చూపు
హైదరాబాద్, నవంబర్ 13 : మాజీ సీఎం కేసీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజ్కెన్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫార్మా స్యూటికల్స్, ల్కెఫ్ సైన్సెన్స్ రంగంలో మన హైదరాబాద్ లో ఐడీపీఎల్‌ను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఐడీపీఎల్ సంస్థ ఎంతో మందికి గొప్ప వాళ్లను తయారు చేసింది.
రెడ్డి ల్యాబ్ ఓనర్ సహా చాలా మంది ఐడీపీఎల్ నుంచి వచ్చారు. 40 శాతం భారత దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతుందని గర్వంగా చెబుతున్నా. కరోనా సమయంలో పారాసిటామల్ టాబ్లెట్స్ కావాలని అమెరికా అధ్యక్షుడు కూడా అడిగారని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ ఫార్మా స్యూటికల్ రంగంలో లీడర్‌గా తయారైంది. దాన్ని మరింత పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. అదే విధంగా తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఫార్మాసిటీ ప్లాన్ చేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మనం పంచాయితీలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాలని కేసీఆర్ మాకు చెప్పారని కేటీఆర్ తెలిపారు.





