అపార్‌ ‌కార్డు నమోదులో అపారమైన సమస్యలు

image.png
డా. ముచ్చుకోట. సురేష్‌ ‌బాబు, అధ్యక్షులు, నిర్వాసితుల సంక్షేమ సంఘం.
కేంద్రం తెచ్చిన అపార్‌ ‌కార్డు నమోదులో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. అపార్‌ ‌కార్డు నమోదు కోసం ఆధార్‌ ‌కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే నమోదు సమయంలో ఆధార్‌ ‌కార్డులో వివరాలు, అడ్మ్షిన్‌ ‌రిజిస్టర్‌, ‌యూడైస్‌లో వివరాలతో పోలిస్తే తప్పుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆధార్‌ ‌కార్డులో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఆధార్‌ ‌కార్డులో పుట్టినరోజు, తండ్రి పేరు వంటి వివరాలు మార్చాల్సి వొస్తే.. బర్త్ ‌సర్టిఫికేట్‌ ‌కావాల్సి వొస్తోంది. దీంతో బర్త్ ‌సర్టిఫికేట్‌ ‌లేని గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండల రెవెన్యూ ఆఫీస్‌హొచుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఇదే అదనుగా నోటరీలు డబ్బు వసూలు చేస్తున్నారు. ఇంటర్నెట్‌ ‌సెంటర్లు, జెరాక్స్‌సెంటర్లలో విపరీతమైన రద్దీ,విద్యార్థుల నుం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్‌ ‌కార్డు ఉన్నట్లే.. ఒక దేశం, ఒక స్టూడెంట్‌ ‌కార్డు పేరుతో కేంద్రం విద్యార్థుల కోసం అపార్‌ ‌తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆటోమేటెడ్‌ ‌పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ ‌రిజిస్ట్రీ (అపార్‌) ‌తీసుకువొచ్చింది. అయితే విద్యార్థుల అపార్‌ ‌నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థి పుట్టినప్పటి వివరాలు.. ఆధార్‌ ‌కార్డులో ఉన్న వివరాలు తప్పుగా ఉండటమే ఇందుకు కారణం. విద్యార్థి వివరాలను అడ్మిషన్‌ ‌రిజిస్టర్‌తో పాటు యూడైస్‌లో పొందుపరిచారు. అపార్‌ ‌నమోదు సమయంలో ఆధార్‌ ‌కార్డు వాడటంతో.. ఆధారు కార్డులో పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి మిగతా వివరాలు అడ్మిషన్‌ ‌రిజిస్టర్‌, ‌యూడైస్‌లతో పోలిస్తే వేర్వేరుగా ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి విద్యార్థికి ‘అపార్‌’ ‌కార్డు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్న•హాలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది.
కార్డుపై క్యూఆర్‌ ‌కోడ్‌తో పాటు 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొందవొచ్చు. విద్యార్థులకు కొత్త కార్డులు రానున్నాయి. ఆధార్‌ ‌కార్డు తరహాలోనే విద్యార్థకులకు కూడా ఆటోమేటెడ్‌ ‌పర్మినెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ ‌రిజిస్ట్రీ (ఆపార్‌) ‌కార్డులు రానున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి అపార్‌ అం‌దిం చేం దుకు కేంద్ర ప్రభు త్వం సన్నహాలు చే స్తోంది. ఇప్పటికే ప్ర భుత్వ, ప్రైవేటు సం స్థల్లో తొమ్మిది, పదో తరగతులు చదువు కుంటున్న విద్యార్థులకు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వన్‌ ‌నేషన్‌-‌వన్‌ ‌స్టూడెంట్‌ ‌నినాదంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ అపార్‌ ‌కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. ఒక విద్యార్థికి వొచ్చిన గుర్తింపు సంఖ్య, మరో విద్యార్థికి రాదు. ప్రస్తుతం ఆధార్‌ ‌కార్డులకు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయి. దేశంలో ఒక వ్యక్తికి ఉన్న ఆధార్‌ ‌నెంబర్‌ ‌మరొ వ్యక్తికి ఉండదు. సరిగ్గా ఇదే తరహాలో విద్యార్థులకు కూడా గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. సమా చార గోప్యత అనేది లేకుండా ఉంది, ఆధార్‌, అపార్‌, ‌బ్యాంక్‌ అకౌంట్‌, ‌పాన్‌ ‌కారు అన్నీ లింక్‌ అయి ఉంటాయి. అపార్‌ ‌వివరాలు సేకరించే ఏజెన్సీ ఎవరికైనా విక్రయిస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వొస్తుంది.అపార్‌ ‌కార్డులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్‌ ‌కోడ్‌, 12 అం‌కెల గుర్తింపు సంఖ్య ఉంటుంది.
అయితే క్యూఆర్‌ ‌కోడ్‌ను స్కాన్‌ ‌చేస్తే మాత్రం విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్‌ ‌కోడ్‌, 12 అం‌కెల గుర్తింపు సంఖ్యతో పాటు ఆ విద్యార్థి మార్కులు, గ్రేడ్లు, ఉపకార వేతనాల వివరాలు, అవార్డులు, డిగ్రీలు, క్రీడలు, ఇతర అంశాల్లో సాధించిన విజయాలతో పాటు విద్యా సంబంధింత వివరాలతో సమగ్ర రికార్డును అందుబాటులో ఉంది. క్యూఆర్‌ ‌కోడ్‌ ‌స్కాన్‌ ‌చేయగానికి మొత్తం వివరాలను తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు ఉపయోగపడుతోంది. మరోవైపు విద్యార్థుల ఆధార్‌ ‌సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల అక్టోబర్‌ 22 ‌నుంచి 25 వరకూ ఆధార్‌ ‌నమోదు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కేంద్రాల్లో కేవలం ఫోన్‌ ‌నంబర్‌ అప్‌ ‌డేట్‌ ‌వంటి చిన్న చిన్న సమస్యలను మాత్రమే కరెక్షన్స్ ‌చేస్తున్నారు.
తండ్రి పేరు, పుట్టినరోజు వివరాల్లో తప్పులు ఉంటే కరెక్షన్‌ ‌చేసేందుకు బర్త్ ‌సర్టిఫికేట్లు అడుగుతున్నారు. దీంతో బర్త్ ‌సర్టిఫికేట్లు లేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బర్త్ ‌సర్టిఫికేట్లు ఇప్పటికిప్పుడు పొందేందుకు కూడా అవకాశం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్స్‌ల్లో జన్మించిన వారికి బర్త్ ‌సర్టిఫికేట్ల సమస్య పెద్దగా ఉండటం లేదు.  కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద పుట్టిన వారికి ఈ పుట్టినరోజు ధ్రువపత్రం సమస్య వొస్తోంది. నిరక్షరాస్యత, బర్త్ ‌సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకోకపోవటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అపార్‌లో నమోదు చేసేముందు ఆధార్‌ ‌కార్డులో, స్కూలు అడ్మిషన్‌ ‌రిజిస్టర్‌లో వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోవటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *