పునరుత్పాదక ఉద్యోగకల్పనలో భారత్ భేష్

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్ఇఎన్ఎ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) సంయుక్తంగా చేసిన విడుదలచేసిన నివేదిక 2024 విడుదలచేసింది. ఇది పునరుత్పాదక ఇంధన విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, లేబర్ మార్కెట్ కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాల సృష్టిని ప్రభావితం చేసే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విధానాలను నివేదిక అంచనా వేస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన రంగంలో ఉపాధి ధోరణుల యొక్క సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. ఈ నివేదిక ప్రకారం పునరుత్పాదక శక్తిరంగంలో 2023లో కల్పించబడ్డ ఉద్యోగాలు 1.67 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు యేడాది ఇవి 1.37కోట్లగా ఉన్నాయి. ఇది 18 శాతం వార్షిక పెరుదలకు సమానం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే తీరునలేదు. ప్రపంచ సౌర, పవన సామర్థ్యంలో మూడింట రెండు వంతులు చైనాలోనే ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 70.4 లక్షల పునరుత్పాదక శక్తి ఉద్యోగాలతో చైనా అగ్రగామిగా ఉంది. ఇది ప్రపంచ మొత్తంలో 46 శాతానికి సమానం. తరువాత స్థానంలో 18 లక్షల ఉద్యోగాలతో యూరోపియన్ యూనియన్, 15.6 లక్షలతో బ్రెజిల్ ఉంది. యునైటెడ్ స్టేట్స్, ఇండియాలు ఒక్కొక్కటి దాదాపు పది లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సోలార్ ఫోటోవోల్టాయిక్స్ (పివి) రంగం నుండి బలమైన ప్రేరణ కొనసాగింది.

ఇది ప్రపంచవ్యాప్తంగా 72 లక్షల ఉద్యోగాలకు మద్దతు ఇచ్చింది. వీటిలో 46 లక్షలు చైనాలోనే ఉన్నాయి. ద్రవ జీవ ఇంధనాలు రెండవ అతిపెద్ద ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. తరువాత జలవిద్యుత్, పవన రంగాలలో ఉన్నాయి. జీవ ఇంధనాల ర్యాంకుల్లో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. ఈ రంగంలో ప్రపంచంలోని 28 లక్షల ఉద్యోగాలలో మూడవ వంతు వాటాను కలిగి ఉంది. విపరీతమైన ఉత్పత్తి ఇండోనేషియాను రెండవ స్థానంలో ఉంచింది. ఇది ప్రపంచ జీవ ఇంధనాల ఉద్యోగాలలో నాలుగింట ఒక వంతుకు సమానం. బ్రెజిల్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, వియత్నాం పరిశ్రమలో అతిపెద్ద యజమానులుగా ఉన్నాయి. పవన రంగంలో, చైనా, ఐరోపాలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. టర్బైన్ తయారీ, ఇన్‌స్టాలేషన్‌లలో అగ్రగామిగా ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 లక్షల ఉద్యోగాలకు వరుసగా 52 శాతం, 21 శాతం సహకారం అందించాయి. అపారమైన వనరుల ఉన్నప్పటికీ ఆఫ్రికా ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడిలో కొద్దిపాటి వాటాను మాత్రమే పొందుతోంది. ఇది 2023లో మొత్తం 3.24 లక్షల పునరుత్పాదక ఉద్యోగాలను మాత్రమే కల్పించాయి. 2030 నాటికి పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలంటే ప్రపంచం వేగవంతంగా చర్యలు తీసుకోవాలి.

మన దేశపరిస్థితి:
2023లో ఈరంగంలో మనదేశం మొత్తం 10.2 లక్షల
ఉద్యోగాలను కల్పించింది. దేశంలో పునరుత్పాదక రంగంలో ఉద్యోగాల కల్పనలో జలవిద్యుత్ రంగం దాదాపు 4,53,000 ఉద్యోగాలను కల్పించి అగ్రగామిగా ఉంది. ప్రపంచ మొత్తంలో 20% వాటాను కలిగి ఉంది. చైనా తర్వాత రెండవది. భారతదేశంలోని సోలార్ పి.వి రంగం ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ సిస్టమ్‌లలో దాదాపు 3,18,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. భారతదేశం 2023లో 9.7 గిగా వాట్ సౌర పివి సామర్థ్యాన్ని జోడించింది. కొత్త ఇన్‌స్టాలేషన్‌లు సంచిత సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో నిలిచింది. ఇది సంవత్సరం చివరి నాటికి 72.7 గిగా వాట్సుకి చేరుకుంది. భారతదేశం యొక్క కార్యాచరణ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 2023లో 46 గిగా వాట్స్ గా ఉంది. 2024లో 58 గిగా వాట్స్ కి పెరుగుతుందని అంచనా వేయబడింది. అదేవిధంగా వోల్టాయిక్ సెల్ తయారీ సామర్థ్యం 2023లో 26 గిగా వాట్స్ గా ఉంది. 2024లో 32 గిగా వాట్స్ కి చేరుతుందని అంచనా వేయబడింది. దీనితో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద పివి తయారీదారుగా అవతరించింది.

2023లో గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ పివిలో 2,38,000 ఉద్యోగాలను కలిగి ఉందని అంచనా వేసింది. ఇది 2022 నుండి 18% పెరుగుదల. ఆఫ్ గ్రిడ్ సోలార్ సెక్టార్‌లో దాదాపు 80,000 మంది పనిచేశారు. భారతదేశం 2023లో 44.7 గిగా వాట్స్ సంచిత పవన విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది. 2023లో దేశం 2.8 గిగా వాట్స్ పవన సామర్థ్యాన్ని జోడించింది. ఇది ఐదు సంవత్సరాల మందవృద్ధి తర్వాత గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ పవన రంగం 2023లో సుమారు 52,200 మందికి ఉపాధిని కల్పించింది. దాదాపు 40% కార్యకలాపాలనిర్వహణలో, 35% సంస్థాపనలో ఉంది. 2023లో భారతదేశంలోని పునరుత్పాదక ఇంధన రంగంలో 10.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇందులో హైడ్రోపవర్, సోలార్ ఫోటోవోల్టాయిక్‌లు అత్యధిక వ్యక్తులకు ఉపాధిని కల్పించాయి. దానికి అదనంగా, పవన శక్తి 52,000 ఉద్యోగాలను సృష్టించింది, లిక్విడ్ బయోఫ్యూయల్స్ 35,000, సాలిడ్ బయోమాస్ 58,000 ఉద్యోగాలను అందించాయి. సోలార్ హీటింగ్, కూలింగ్ సెక్టార్‌లో 17,000 మందికి ఉపాధి లభించింది. బయోగ్యాస్ 85,000 ఉద్యోగాలను సృష్టించింది. పునరుత్పాదక వనరుల నుండి వార్షిక విద్యుత్ ఉత్పత్తి పునరుత్పాదక శక్తి కోసం భారతదేశం యొక్క అంకితభావం ఇటీవలి సంవత్సరాలలో వార్షిక విద్యుత్ ఉత్పత్తి ధోరణులలో స్పష్టంగా కనిపిస్తుంది.

మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు:
భారతదేశం అనేక రకాల కార్యక్రమాల ద్వారా స్థిరమైన ఇంధన భవిష్యత్తును వేగవంతం చేస్తోంది. ముఖ్య కార్యక్రమాలలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పి.యం కుసుమ్, పియం సూర్య ఘర్ పథకాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలు పునరుత్పాదక శక్తిని స్వీకరించడమే కాకుండా గణనీయమైన ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తాయి. ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగంలో శ్రామికశక్తి 2022లో 1.37 కోట్ల నుండి 1.62 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదలకు భారతదేశం గణనీయమైన సహకారం అందించింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి వృద్ధి చెందుతూనే ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థను పెంచడమే కాకుండా లక్షల మందికి స్థిరమైన జీవనోపాధిని కూడా సృష్టిస్తోంది. హరిత భవిష్యత్తును రూపొందించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంధన స్వాతంత్ర్యం, పర్యావరణ స్థిరత్వం వైపు భారతదేశం యొక్క ప్రయాణానికి మద్దతు ఇస్తుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉపాధి కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది.

జనక మోహన రావు దుంగ
ఫోన్ 8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *