హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

శని, ఆదివారాల్లోనే కూల్చివేతల‌ మతలబు ఏంటి
ఓనర్లకు త‌గిన‌ సమయం ఇవ్వరా?
చట్టప్రకారం నడుచుకోక పోతే హైడ్రాపైనే స్టే విధిస్తాం
వొచ్చేనెల 15 వరకు విచారణ వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబర్ 30: ‌హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ‌గా దీనిపై సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్‌ ‌రంగానథ్‌ ‌వర్చువల్‌గా, అన్‌పూర్‌ ‌తహసీల్దార్‌ ‌కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా ఎందుకు కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా? అని ప్ర‌శ్నించింది.

చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్‌ను హెచ్చరించింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు సూచించింది. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బందిని కోరడంతో సమకూర్చామని బదులివ్వగా.. చార్మినార్‌ ‌కూల్చివేతకు తహసీల్దార్‌ ‌యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వొస్తుందని హెచ్చరించింది.

ఖాలీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్‌ ‌బాస్‌లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అధికారులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు.. జాగ్రత్త అంటూ హెచ్చరించింది.  మూసీపై కూడా 20 లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచాం. జీ.ఓ. ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయి. మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి పెట్టారు. ట్రాఫిక్‌ ‌సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉంది. కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మాదాపూర్‌లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా? నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీ.వో.పై స్టే ఇవ్వాల్సి వొస్తుంది. సబ్‌ ‌రిజిస్ట్రార్‌  ‌రిజిస్ట్రేషన్‌ ‌చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారు.

స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వొస్తోంది. ఆదివారం కూల్చివేతలు వొద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉంది. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్‌ ‌చేయవచ్చు కదా? హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. పనితీరే అభ్యంతరకరం. అన్‌పూర్‌ ‌తహసీల్దార్‌, ‌హైడ్రా కమిషనర్‌ ‌తీరు అసంతృప్తికరంగా ఉంది.. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదు. ఎప్టీఎల్‌ ‌నిర్ధారించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది. విచారణను అక్టోబర్‌ 15‌కు వాయిదా వేసింది. అప్పటివరకు యథాతధ‌ స్థితి కొనసాగించాలని హైడ్రా, అన్‌ఫూర్‌ ‌తహసీల్దార్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పింది.  ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అంటూ హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు న్యాయమూర్తి ప్రశ్నించింది. ఈ సందర్భంగా కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్‌ ‌తెలిపారు. మూసీపై కూడా 20 లంచ్‌మోషన్‌ ‌పిటిషన్లు దాఖలయ్యాయని న్యాయమూర్తి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయం లేదని చెప్పారు. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచామన్నారు. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్‌ ‌చేయవచ్చు కదా అన్నారు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని, పనితీరే అభ్యంతరకమన్నారు. అన్‌పూర్‌ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్‌ ‌తీరు అసంతృప్తికమరని చెప్పారు. ఎఫ్‌టీఎల్‌ ‌నిర్దారించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారన్నారు. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *